బ్రూస్ లీ బ్యూటీ.. అక్కడ ఆరబోస్తోంది

Update: 2017-01-05 07:45 GMT
రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీలో హీరోకి అక్కగా నటించిన అందగత్తె కృతి కర్బందా. బ్రూస్ లీ టైటిల్ పై తెలుగుతో పాటుతో తమిళ్ లోనూ సినిమా తెరకెక్కితే.. ఇక్కడ హీరోకి అక్కగా నటించి అలరించి కృతి.. కోలీవుడ్ లో మాత్రం బ్రూస్ లీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాసింత అడల్ట్ కంటెంట్ ని మిక్స్ చేసి కోలీవుడ్ జనాలపైకి సినిమాలు వదిలే మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్.. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ తమిళ బ్రూస్ లీ ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉంది కృతి కర్బందా. ఇప్పటివరకూ తెలుగు కన్నడ కలిపి దాదాపు 20 సినిమాలు చేసేసిన కృతికి.. ఇది కోలీవుడ్ లో మాత్రం బ్రూస్ లీనే మొదటి సినిమా. అందుకే అరంగేట్రంలోనే అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి.. ప్రచారంలో పరిధికి మించి రెచ్చిపోతోంది ఈ సుందరాంగి. ఇక్కడ అక్క పాత్ర కావడంతో అణకువగా కనిపించింది కానీ.. అక్కడ బ్రూస్ లీకి గ్లామర్ భామ కావడంతో.. అందాల ప్రదర్శన చేస్తూ ప్రమోషన్స్ పూర్తి చేస్తోంది. అమ్మడు చూపిస్తున్న గ్లామర్ డోస్ దెబ్బకి.. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే.. చాలామంది అభిమానం పెంచేసుకుంటున్నారట.

ఈ కోలీవుడ్ బ్రూస్ లీ ఓ ఆరు నెలల క్రితమే రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. ప్రొడక్షన్ లేట్ కావడంతో.. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి  సందర్భంగా జనవరి 13న తమిళ బ్రూస్ లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరో యాక్షన్ సీన్స్ కూడా ఇరగదీశాడని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News