కుర్ర హీరోని ఎటూ ఎగిరిపోనివ్వ‌ద‌ట‌!

Update: 2022-07-04 03:04 GMT
మ‌హేష్ స‌ర‌స‌న 1 నేనొక్క‌డినే .. నాగ‌చైతన్య స‌ర‌స‌న దోచేయ్ చిత్రాల్లో న‌టించింది కృతి స‌నోన్. కానీ ఇవి రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపులుగా మిగిలాయి. ఆ త‌ర్వాత ఇక కృతి స‌నోన్ తెలుగు సినీప‌రిశ్ర‌మ వైపు చూడ‌లేదు. పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మైంది.

చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ 3డి లో ఆఫ‌ర్ అందుకుంది. కృతి స‌నోన్ కి ఇది క్రేజీ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీతో కృతి రేంజు మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కృతి సీత పాత్ర‌లో నటిస్తుండ‌గా శ్రీరాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గానే కృతి స‌నోన్ తాజా ఇంట‌ర్వ్యూలో ఓ కుర్ర‌హీరోపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కార్తీక్ ఆర్యన్ తో కృతి సనన్ క‌లిసి ఉన్న ఒక వీడియో ఇటీవ‌ల వైర‌ల్ గా మారింది. అందులో ఈ యువ‌జంట‌ చిట్ చాట్ చేస్తూ కనిపించింది. అదే సమయంలో కార్తీక్ తాజా చిత్రం 'భూల్ భూలైయా 2'ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ వీడియోలో 'భూల్ భూలయ్యా 2' బాక్సాఫీస్ కలెక్షన్ లు రూ. 200 కోట్లు దాటిందని ప్రస్తావిస్తూ మిస్టర్ 200ని కలవడం త‌నకు ఎలా అనిపిస్తోంది? అన్న ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది కృతి.

దానికి సమాధానంగా.. కార్తీక్ చాలా ఎత్తుకు చేరుకున్నాడు. నేను అతనిని ఇక చూడలేను... అనేసింది తొలుత‌. కానీ హారర్ డ్రామా భూల్ భుల‌యా 2 విజయానికి ముందు చూసిన కార్తీక్ అదే విధంగా ఇప్పుడు లేడా? అని కూడా కృతిని అడిగారు.

దానికి కొంత సమయం తీసుకున్న కృతి తాపీగా స‌మాధాన‌మిచ్చింది. కార్తీక్ ఇంతకు ముందు తెలిసిన వ్యక్తిగానే ఉన్నాడ‌ని అప్ప‌టికి ఇప్ప‌టికి అత‌డిలో మార్పు లేద‌ని కూడా కృతి పేర్కొంది. ఆమె సరదాగా కార్తీక్ ను త‌డుతూ..''మేము అతన్ని చాలా ఎత్తుకు ఎగరనివ్వము'' అని ప‌రాచికం ఆడింది.

దినేష్ విజన్ 'లుకా చుప్పి'లో చివరిగా కనిపించిన కార్తీక్-కృతి జంట తిరిగి ఓ సినిమా చేస్తున్నారు. కార్తీక్ తదుపరి చిత్రం షెహజాదాలో కృతి క‌థానాయిక‌. అల్లు అర్జున్ నటించిన తెలుగు బ్లాక్ బ‌స్టార్ 'అల వైకుంఠపురములో'కి హిందీ రీమేక్. రోహిత్ ధావ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా టీ -సిరీస్ నిర్మిస్తోంది.


Full View

Tags:    

Similar News