బ్రహ్మోత్సవానికి బాలీవుడ్ తారల క్యూ

Update: 2015-09-23 19:02 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ తో సీతమ్మ వాకిట్లో తీసిన శ్రీకాంత్ అడ్డాల.. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ కు బాలీవుడ్ తారాగణం వరుసగా క్యూ కడుతుండడం విశేషం.

మొన్నటికి మొన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వచ్చి.. మహేష్ తో బోలెడుసేపు మంతనాలు ఆడాడు. ఇప్పుడు వరుణ్ ధావన్ - క్రిత సనోన్ వచ్చి టాలీవుడ్ ప్రిన్స్ తో పిచ్చాపాటీ చెప్పుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న దిల్‌వాలే చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. అదేనండీ షారుక్ మూవీలోనే వీళ్లిద్దరు కూడా ఉన్నారు.

వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ కలిసి నటించిన క్రితి.. షాట్ బ్రేక్ రాగానే తన రీల్ హీరోని వెంటేసుకుని మహేష్ దగ్గరకు వచ్చేసింది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అంతా కలిసి కాసేపు నవ్వుకున్నారు. షారుక్ మహేష్ ని కలిసి వెళ్లాక.. హైద్రాబాద్ బిర్యానీ తినాలని ఉందని ట్వీట్ చేశాడు. ఈయన్ని ఇంటికి పిలిచి డిన్నర్ ప్లాన్ చేస్తున్నారట మహేష్, నమ్రతలు. పనిలోపనిగా క్రితి కూడా జాయిన్ అయిపోతుందిలెండి.
Tags:    

Similar News