ఈమద్య కాలంలో మీడియా ప్రభావం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా సెలబ్రెటీలు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఎలా ఉన్నారు అనే విషయాలను కవర్ చేసి జనాలకు అందించేందుకు మీడియా వారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. జనాలు కూడా సెలబ్రెటీల డైలీ లైఫ్ మరియు వారి జీవన విధానం చూడాలని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే మీడియా వారు ఎక్కువగా ఆ విషయాలపై ఫోకస్ పెడుతున్న కారణంగా సెలబ్రెటీల వ్యక్తిగతంకు భంగం వాటిల్లుతుంది. ఎక్కడకు పోయినా కూడా కెమెరాలు పట్టుకుని జర్నలిస్టులు ఉంటున్న కారణంగా వారు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ ఆ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంత్యక్రియలకు వెళ్లిన చోట తాను చాలా ఇబ్బంది పడ్డట్లుగా చెప్పుకొచ్చింది.
ఇటీవల మృతి చెందిన సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలకు గాను కృతి సనన్ వెళ్లిన సమయంలో ఆమెకు చాలా దగ్గరగా కెమెరాలు తీసుకు వచ్చి ప్లాష్ వేయడం.. మైక్ లు పెట్టి మాట్లాడండి అంటూ ఇబ్బంది పెట్టారట. ఆ సమయంలో చాలా మంది చాలా రకాలుగా సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డట్లుగా చెప్పుకొచ్చారు. ఆ విషయమై తాజాగా కృతి సనన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చావు వద్దకు వెళ్లిన సమయంలో మీడియా వారి అత్యుత్సాహం ఏంటీ అంటూ ప్రశ్నించింది. ఆమె ఇంకా ఆ విషయమై స్పందిస్తూ.. మీడియా హద్దుల్లో ఉండాలి. తమకు తాము హద్దులు పెట్టుకుని ఉండాలి. అంత్యక్రియలు వార్త కాదు.. వినోదం అంతకంటే కాదు. దయచేసి అలాంటివి కవర్ చేసేందుకు ప్రయత్నించడం మానుకోండి. బాధల్లో ఉన్న వారి మొహాల్లో కెమెరా ఫ్లాష్ పెట్టి మాట్లాడించేందుకు ప్రయత్నించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కృతి సనన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియా వర్గాల్లో కూడా సెలబ్రెటీల గురించి విమర్శలు చేయడం.. వారి వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చడం వంటివి జరుగుతున్నాయి. కనుక చాలా మంది చాలా రకాలుగా మీడియాను హద్దుల్లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. అయినా కూడా కొందరు మాత్రం అత్యుత్సాహం చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున మీడియాలో సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలకు సంబంధించిన వార్తలు మరియు సెలబ్రెటీల హాజరును చూపించే ప్రయత్నం చేశారు. కృతి సనన్ ఈ విషయంలో కాస్త ఎక్కువ ఫీల్ అయినట్లుంది. అందుకే ఆమె మీడియాపై విసుర్లు.