ఫోటో స్టొరీ: ఆఫ్రికా అడవిలో అందాల భామ

Update: 2019-03-28 11:47 GMT
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ పేరు దాదాపుగా తెలుగు సినీ ప్రేమికులు అందరికీ తెలిసే ఉంటుంది.. ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానులకు... ఎందుకంటే ఈ భామ '1 నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్ గా నటించింది.  నాగ చైతన్య 'దోచెయ్' లో కూడా హీరోయిన్.  ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో చేసేది లేక ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. కానీ అక్కడ కెరీర్ సూపర్ గా ఉంది.

ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. హాటు బ్యూటీల లాగా అందాలు ఆరబోసి.. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ' అని పాటపాడే టైపు కాదు.  కాస్త డీసెంట్ గా ఉండే రకమే. అయినా ఈ అమ్మడికి ఇన్స్టాగ్రామ్ లో 19 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే మనం కృతి క్రేజును అర్థం చేసుకోవచ్చు.  రీసెంట్ గానే ఆ 19 మిలియన్ల మార్కు టచ్ కావడంతో తెగ గెంతులేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.  ఇక లేటెస్ట్ గా మరో ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో ఒక స్లీవ్ లెస్ స్కై బ్లూ కలర్ లాంగ్ గౌన్ వేసుకొని ఆఫ్రికా అరణ్యంలో పోజిచ్చింది.  కానీ ఇది ఒక పాత ఫోటోనట.  తనే 'త్రో బ్యాక్  ఫోటో' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాతఅయితేనేం.. కొత్త అయితేనేం.. అడవిలో నడుస్తున్న అందాల వనదేవతలా ఉంది.  సడెన్ గా చూస్తే ఎవరో హాలీవుడ్ హీరోయిన్ అనిపించేలా ఎర్రగా బుర్రగా ఉంది.

త్రోబ్యాక్ ఫోటో అయినా నెటిజనులకు కూడా భలేగా నచ్చినట్టుంది. పోస్ట్ చేసిన ఏడు గంటల్లోనే ప్రేమగా మూడున్నర లక్షలకు పైగా లైకులు కొట్టారు.  కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'కళంక్'.. 'అర్జున్ పాటియాలా'.. 'హౌస్ ఫుల్ 4'.. 'పానిపట్' సినిమాల్లో నటిస్తోంది.


Tags:    

Similar News