లివిన్ రిలేషన్ పై కృతి సనన్ ఇలా అంటోంది!

Update: 2019-02-07 16:26 GMT
ఈమధ్య లివిన్ రిలేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది.  సామాజిక న్యాయం అనేది సమాజంలో ఉందో లేదో తెలీదు కానీ సిటీల్లో సహజీవనం చాలా సాధారణం. ఈ కథాంశంతో బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఎప్పుడో 2005 లోనే ఈ కథాంశంతో సైఫ్ - ప్రీతి జింటాలు 'సలామ్ నమస్తే' అనే సినిమాలో నటించారు. తాజాగా ఇదే కాన్సెప్ట్ తో హిందీ లో 'లుకా చుప్పి'  అనే సినిమా తెరకెక్కింది.   'లుకా చుప్పి' హీరోయిన్ కృతి సనన్  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.

సహజీవనం పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే.. "సహజీవనం చేస్తున్న వారిని నేను జడ్జ్ చేయలేను కానీ నావరకైతే నేను అలాంటి సంబంధం ఎంచుకొను. లివిన్ రిలేషన్ ను మా ఇంట్లో అంగీకరించరు. అందుకే నేను వాటికి దూరం" అని చెప్పింది. అలా అని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చేసుకోదట.  ఈ విషయం ఇంట్లో వాళ్ళకు క్లియర్ గా ముందే చెప్పేసిందట. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనకు ముందే తెలిసి ఉండాలని.. ఎందుకంటే అతనితో జీవితాంతం కలిసి ఉండాలి కదా.. అంటూ చెప్పుకొచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎఫైర్ వార్తల గురించి అడిగితే "ఇలాంటి వార్తలు 2016 నుంచి మాపై వస్తూనే ఉన్నాయి. నేను ఇలాంటివి అసలు పట్టించుకోను.  మేమిద్దరం మంచి ఫ్రెండ్స్" అంటూ క్లారిటీ ఇచ్చింది.  

'లుకా చుప్పి' మార్చి 1 న విడుదల అవుతోంది.  ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ నటించాడు.  లక్ష్మణ్ ఉతేకర్ ఈ సినిమాకు దర్శకుడు.  ఈ సినిమాను మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజాన్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా తర్వాత కృతి సనన్ కు 'అర్జున్ పాటియాలా'.. 'హౌస్ ఫుల్ 4'.. 'పానిపట్' చిత్రాల్లో లైన్లో ఉన్నాయి.
    

Tags:    

Similar News