బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా ఏడాది కావస్తుంది. ఆయన మరణం అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని చాలా మందికి మరియు ఆయన సన్నిహితులకు దుఃఖంను మిగిల్చింది. సుశాంత్ మృతి తర్వాత చాలా మంది మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన దుఃఖంను వ్యక్తం చేశారు. కాని ఆయనతో కలిసి రాబ్తా సినిమాలో నటించి సూపర్ హిట్ దక్కించుకున్న కృతి ససన్ మాత్రం మౌనంగా ఉంటూ వచ్చింది. ఆమె ను మీడియా వారు సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా ఆ విషయమై స్పందించేందుకు నిరాకరించింది. తాను ఏమీ మాట్లాడే పరిస్థితి లేను అంది.
సుశాంత్ మరణంపై ఎట్టకేలకు కృతి సనన్ నోరు విప్పింది. గత ఏడాది నా జీవితంలో చాలా చేదు అనుభవాలను మిగిల్చి వెళ్లింది. సుశాంత్ మరణం తర్వాత నా మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు. సుశాంత్ మరణం గురించి స్పందిస్తే కొందరు పాజిటివ్ గా మరి కొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు. అందుకే తాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. సుశాంత్ గురించి జరుగుతున్న నెగటివ్ ప్రచారంలో తాను భాగం కావద్దనే ఉద్దేశ్యంతో నేను స్పందించలేదు అంది. ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ మూవీ ఆదిపురుష్ లో సీత పాత్రను చేస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు హిందీలో మరి కొన్ని సినిమాలకు కూడా ఈమె కమిట్ అయ్యింది.