యోగా నేర్పిస్తానంటున్న దెయ్యం భామ

Update: 2016-12-29 03:30 GMT
టాలీవుడ్ లో వరుస అవకాశాలు సంపాదించుకుంటున్న బ్యూటీ కృతిక జయకుమార్. దృశ్యం మూవీలో వెంకటేష్ కూతురుగా ఈ అమ్మాయి నటనకు మంచి మార్కులు పడ్డంతో బాగానే అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే వినవయ్యా రామయ్యాతో హీరోయిన్ అయిపోయినా.. రోజులు మారాయి చిత్రంతో హీరోయిన్ గా తనకుంటూ గుర్తింపు సంపాదించుకోగలిగింది. ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న కృతిక.. నటి అవుతానని అస్సలు అనుకోలేదట. వరుస ఆఫర్లు ఇప్పుడు తననీ స్థాయికి తీసుకొచ్చాయని చెబుతోంది. ఈ నెల 31న విడుదల కానున్న ఇంట్లో దెయ్యం-నాకేం భయం చిత్రంతో తనకు బ్రేక్ వస్తుందని.. ఈ మూవీలో తన రోల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతోంది కృతిక. పుణ్యం.. కర్మ లాంటి వాటిని విపరీతంగా యోగా టీచర్ ఇందుమతి పాత్రలో ఈ సినిమాలో నటించిందట కృతిక. ఆ పాయింట్స్ చుట్టూ బోలెడంత కామెడీ పండగా.. సెకండాఫ్ లో కేరక్టర్స్ రివర్స్ అయిపోయి.. బోలెడంత పెర్ఫామెన్స్ ఇచ్చే అవకాశం దక్కిందని అంటోంది.

ప్రస్తుతం తెలుగుతోపాటు కన్నడ సినిమాల్లోనూ నటిస్తుండడంతో హైద్రాబాద్-బెంగళూరుల మధ్య ప్రయాణాలతో అలసటగా ఉన్నా.. బాగానే ఉందట. నాని యాక్టింగ్ సూపర్బ్ గా ఉంటుందని చెబుతున్న సుందరి.. నిత్యా మీనన్ నటనను అభిమానిస్తుందట. అలాగే మణిరత్నం.. గౌతమ్ మీనన్ సినిమాల్లో చూపించే ఎమోషన్స్ విపరీతంగా నచ్చుతాయని చెబుతోంది కృతిక జయకుమార్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News