కరణ్ జోహార్ ‌ను ఇరికిస్తే న‌న్ను వ‌దిలేస్తామ‌ని NCB అధికారులు చెప్పారు!- క్షితిజ్ ప్రసాద్

Update: 2020-09-28 17:31 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ దర్యాప్తులో ప్రశ్నించిన తరువాత క్షతిజ్ ప్రసాద్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం అరెస్టు చేసింది. ఈ స‌న్నివేశంలో ఆయ‌న చేసిన ఆరోప‌ణ హాట్ టాపిక్ అయ్యింది. ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్ (ధర్మ ప్రొడక్షన్స్ కి చెందిన‌ డిజిటల్ విభాగం) ఉద్యోగి క్షితిజ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ``ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ పేరును తప్పుగా ఇరికించవలసి వచ్చింది`` అని ఆరోపించిన‌ట్టు ప్ర‌ముఖ జాతీయ చానెల్ క‌థ‌నం వేయ‌డం విశేషం.

``నేను కరణ్ జోహార్.. సోమెల్ మిశ్రా.. రాఖీ.. అపూర్వా (మెహతా).. నీరజ్ లేదా రాహిల్ లను ఇరికించినట్లయితే వారు నన్ను విడిచిపెడతారని ఎన్సీబి అధికారులు చెప్పారు`` అని ప్రసాద్ న్యాయవాది సతీష్ మనేషిందే ఆదివారం ముంబై కోర్టుకు తెలిపార‌ని స‌ద‌రు చానెల్ క‌థ‌నం వెల్ల‌డించింది.

``దర్యాప్తు అధికారులు ఒత్తిడి చేశారు. వారు మాదకద్రవ్యాలను సేవించారని నన్ను తప్పుగా ఆరోపించమని అడిగారని ఆయన అన్నారు. ఈ వ్యక్తులలో ఎవరూ వ్యక్తిగతంగా నాకు తెలియదు కాబట్టి నాపై ఒత్తిడి వ‌చ్చినా అందుకు స‌సేమిరా అన్నాను. నేను ఎవరినీ తప్పుగా ఇరికించాలని అనుకోలేదు`` అని ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రసాద్ ను ధ‌ర్మాటిక్ డిజిట‌ల్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్ సిబి బృందం శుక్రవారం సబర్బన్ వెర్సోవాలోని తన నివాసం నుంచి తీసుకెళ్లింది. అత‌డిని బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో ప్రశ్నించారు. ``శనివారం ప్ర‌సాద్ ని అరెస్టు చేసిన తరువాత ఆసుపత్రిలో కోవిడ్-19 కోసం అలానే ఇత‌ర‌ వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు`` అని ఒక అధికారి మీడియాకి చెప్పారు. ఆ త‌ర్వాత ఎన్.‌సిబి విస్తృత దర్యాప్తులో ప్రసాద్ పేరు మార్మోగింది. హిందీ చిత్ర పరిశ్రమలో డ్రగ్-నెక్సస్ ‌కు సంబంధించిన కేసులో ఒకప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ ‌తో అనుబంధంగా ఉన్న అనుభవ్ చోప్రాను కూడా ఎన్.‌సిబి శుక్రవారం ప్రశ్నించింది.

శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దర్శక‌నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ప్రసాద్ తో త‌న సంబంధాల గురించి వివ‌రించారు. ``ధర్మ ప్రొడక్షన్స్ సోద‌ర సంస్థ అయిన ధర్మాటిక్ ఎంటర్ టైన్మెంట్లో ఒక ప్రాజెక్ట్ కోసం 2019 న‌వంబ‌ర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ నిర్మాతలలో ఒకరిగా చోప్రా చేరారు. చివరికి అది కార్యరూపం దాల్చలేదు. చోప్రా అసిస్టెంట్ డైరెక్టర్ ‌గా తన బ్యానర్ ‌తో కొంతకాలం సంబంధం కలిగి ఉన్నాడని రెండు ప్రాజెక్టులలో మాత్రమే పనిచేశాడు`` అని క‌ర‌ణ్ జోహార్ తెలిపారు. అతడు నవంబర్ 2011 .. జనవరి 2012 మధ్య.. అలాగే 2013 జనవరిలో ఓ లఘు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక చిత్రానికి 2వ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో కేవలం రెండు నెలలు మాత్రమే మాతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ తరువాత అతను ఎప్పుడూ ధర్మ ప్రొడక్షన్స్ తో సంబంధం కలిగి లేడు`` అని క‌ర‌ణ్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News