ఒక్క పైసా తీసుకోకుండానే..దటీజ్ సమంత

Update: 2018-03-28 07:18 GMT

సమంత కేవలం కథానాయికగానే కాక వ్యక్తిగానూ జనాల మనసులు దోచింది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలోనే ఆమె పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సేవా సంస్థ ఆరంభించి ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు చికిత్స చేయించింది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా ఆమె పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఇప్పుడు సమంత మనసెలాంటిదో మరోసారి రుజువైంది. గత ఏడాది సమంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాల ప్రచారకర్తగా నియమితురాలైన సంగతి తెలిసిందే.

ఇందుకోసం సమంత పారితోషకమే తీసుకోలేదట. సమంత ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ ప్రచారంలో పాల్గొంటోందని స్వయంగా మంత్రి కేటీఆరే వెల్లడించారు. ప్రచార కర్త అంటే ఏదో నామమాత్రంగా ఉండటం కాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంది సమంత. ఆమె సిరిసిల్ల సహా మరిన్ని ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొంది. ఫొటో షూట్లు కూడా చేసింది. కొంచెం పేరు వచ్చిందంటే చాలు తమ ప్రతి నిమిషాన్నీ మార్కెట్ చేసుకుని డబ్బులు సంపాదించాలని చూస్తారు చాలామంది సెలబ్రెటీలు. కానీ సమంత మాత్రం అలా ఆలోచించలేదు. మంచి పని కోసం ఉచితంగానే పని చేస్తోంది. ఈ పెద్ద మనసే సమంతను వ్యక్తిగతంగానూ కోట్లాది మందికి చేరువ చేసింది. దక్షిణాదిన మరే కథానాయికకూ లేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
Tags:    

Similar News