శర్వానంద్ హీరోగా ప్రియాంక అరూల్ మోహన్ హీరోయిన్ గా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో నిర్మితం అయిన శ్రీకారం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను జరుపుకుంది. మొదట చిరంజీవి ముఖ్య అతిథిగా ఖమ్మంలో ఆ తర్వాత హైదరాబాద్ లో కేటీఆర్ ముఖ్య అతిథిగా జరిగింది. శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ రావడం పెద్ద సాయంగా చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమా ప్రమోషన్ కు సాయం చేయమని చరణ్ అడిగిన వెంటనే కేటీఆర్ వచ్చేందుకు ఓకే చెప్పేశారు. చిరంజీవి మరియు కేటీఆర్ ల కారణంగా ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రమోషన్ కు సాయం చేసిన కేటీఆర్ ఆ సందర్బంగా మరో సాయంకు హామీ ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ దయచేసి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకే కేటీఆర్ స్పందించాడు. హరీష్ అన్నట్లుగా ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ ను మినహాయింపు ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇచ్చాడు.
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ... వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈవెంట్ కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం.. కాని ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు సంతృప్తి అనిపిస్తుంది. వ్యవసాయం కాన్సెప్ట్ తో అందరికి నచ్చే కమర్షియల్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు ఎంత చక్కగా ఈ సినిమా ను తీశాడో టీజర్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్ చూసిన తర్వాత కొంత వీడియోను కూడా చూశాను. సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆధరించండి.. పైరసీ కాకుండా థియేటర్లలో ఈ సినిమాను చూడండి అంటూ కేటీఆర్ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.