రీమేక్ తీయడంలో నో కిక్

Update: 2016-03-08 04:25 GMT
నారా రోహిత్ తో తుంటరి సినిమా చేస్తున్నాడు దర్శకుడు కుమార్ నాగేంద్ర. ఈయన దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో గుండెల్లో గోదారి - జోరు సినిమాలను తీసిన కుమార్.. తొలిసారిగా రీమేక్ ను ఎంచుకున్నాడు. కోలీవుడ్ మీూవీ మాన్ కరాటేను తెలుగులో నారా రోహిత్ తో తుంటరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు.

తనకు ప్రియదర్శన్ కామెడీ అంటే ఇష్టమంటున్న ఈ డైరెక్టర్.. ఓ సమయంలో ఈ మాన్ కరాటేను చెన్నైలో చూశాడట. మురుగదాస్ కథ అందించిన ఈ మూవీ అక్కడ ఏకంగా 55 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడట కుమార్ నాగేంద్ర. తనే రైట్స్ తీసుకుని తర్వాత నారా రోహిత్ ను కలిశాడట ఈ డైరెక్టర్. తమిళ వెర్షన్ కి తెలుగుకు మార్పులు కనిపిస్తాయని... స్క్రిప్ట్ లో ప్రేమ డోస్ పెంచమని మురుగదాస్ స్వయంగా చెప్పాడంటున్నాడు. దీనికి తగ్గట్లుగానే క్లైమాక్స్ లెంగ్త్ మాత్రం తగ్గించాల్సి వచ్చిందట.

ఓ పేపర్ చుట్టూ తిరిగే ఈ కథలో నారా రోహిత్ అద్భుతంగా నటించాడంటున్నాడు ఈ డైరెక్టర్. అయితే.. ఇప్పుడు స్టోరీ నచ్చి రీమేక్ మూవీ చేస్తున్నా.. తనకు స్ట్రయిట్ సినిమాలంటేనే ఇష్టమని చెబ్తున్నాడు. రీమేక్ అంటే.. తన దగ్గర  పనిచేసే ఆఫీస్ బోయ్ కి కూడా తను తీయబోయే సీన్ ఏంటో తెలిసిపోతే.. సినిమా తీస్తున్న కిక్ - థ్రిల్ ఉండవన్నది కుమార్ నాగేంద్ర చెబ్తున్న మాట.
Tags:    

Similar News