సుకుమార్ పెద్ద రిస్కే చేస్తున్నాడు

Update: 2015-11-08 11:30 GMT
ముందు వారం ‘అఖిల్’ లాంటి భారీ సినిమా వస్తోంది. తర్వాతి వారం మాస్ మసాలా మూవీ ‘బెంగాల్ టైగర్’తో పాటు ‘సైజ్ జీరో’ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రేసులో ఉంది. ఇక నేరుగా కమల్ హాసన్ మూవీ ‘చీకటి రాజ్యం’తో పోటీ పడాలి. అయినప్పటికీ సుకుమార్ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నాడు. సుక్కు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వయంగా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ను ఈ నెల 20న విడుదల చేయడానికే ఫిక్సయ్యాడు.

‘కుమారి 21 ఎఫ్’ బడ్జెట్ తక్కువ కావడం వల్ల సినిమాకు లాంగ్ రన్ ఏమీ అవసరం లేదని, మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని, ఓ వారం బాగా ఆడితే ఈజీగా లాభాల బాట పట్టేయొచ్చని భావిస్తున్నాడు సుకుమార్. అందుకే రిస్క్ ఎక్కువైనప్పటికీ 20వ తారీఖునే తన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించాడు.

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ ఇప్పటికే యూత్ ఆడియన్స్ లో మంచి ఆసక్తి రేపుతోంది. టీజర్, ట్రైలర్ రెండింట్లోనూ సుక్కు ముద్ర కనిపిస్తోంది. యూత్ కి బాగా కనెక్టయ్యే సినిమాలా ఉందిది. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో కూడా హిట్టవడంతో సినిమా మీద పాజిటివ్ బజ్ నెలకొంది. కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదని భావిస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే.. వీకెండ్ అయ్యేసరికే బ్రేక్ ఈవెన్ ఖాయమంటున్నారు. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
Tags:    

Similar News