అందరూ కలిసి కుమారిని పోషిస్తున్నారు

Update: 2015-12-05 11:30 GMT
చిన్న సినిమాలకు వారానికి మించి బండి నడవడం అంటే చాలా కష్టం. సినిమా బావున్నా సరే.. రెండో వారానికి కొంచెం క్రేజ్ ఉన్న సినిమా వచ్చిందంటే దీన్ని తీసి పక్కన పడేస్తారు. ఐతే సినిమా చూపిస్త మావ - రాజు గారి గది లాంటి సినిమాలు ఈ పరిస్థితిని మార్చాయి. రెండు మూడు వారాల తర్వాత కూడా హవా సాగించాయి. రెండు - మూడు వీకెండ్ లలో వీటి స్థానంలో వేరే సినిమాలు వేసినా.. ఆ కొత్త సినిమాల్లో పస లేదని తేలిపోయాక మళ్లీ వీటినే నడిపించారు. ఇప్పుడు ‘కుమారి 21 ఎఫ్’ కూడా వాటి బాటలోనే హవా సాగిస్తోంది.

‘కుమారి 21 ఎఫ్’తో పాటుగా.. తర్వాతి వారాల్లో విడుదలైన సినిమాల్లో పస లేదని తేలిపోవడంతో మూడో వారంలోనూ కింగ్ అనిపించుకుంటోందీ చిన్న సినిమా. కుమారి..తో పాటుగా కమల్ సినిమా చీకటి రాజ్యం విడుదలైంది. దాని కథ తొలి వారంతోనే ముగిసిపోయింది. తర్వాతి వారం సైజ్ జీరో - తను నేను వచ్చాయి. అవీ నిలబడలేదు. దీంతో రెండో వీకెండ్లోనూ హౌస్ ఫుల్ల్స్ తో నడిచింది ‘కుమారి 21 ఎఫ్’. ఇక ఈ వారం ‘శంకరాభరణం’ లాంటి క్రేజీ మూవీ థియేటర్లలోకి దిగింది. దానికి కూడా తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో మళ్లీ జనాలు ‘కుమారి..’ వైపు మొగ్గే పరిస్థితి. మొత్తానికి పోటీగా వస్తున్న సినిమాల్లో పస లేదని తేలిపోతుండటం ‘కుమారి 21 ఎఫ్’కి భలేగా కలిసొస్తోంది. ఆల్రెడీ సినిమాను చూసిన వాళ్లు కూడా ఇంకో మంచి ఛాయిస్ లేకపోవడంతో మళ్లీ దీనివైపే మొగ్గు చూపే పరిస్థితి ఉంది.
Tags:    

Similar News