హాట్ హీరోయిన్ శ్రుతి హాసన్ పై మాజీ హీరోయిన్ ఖుష్బూ ఇండైరెక్టుగా సెటైర్లేశారు. తాము తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం నుంచి తప్పుకున్న తరువాత అక్కడాఇక్కడా శ్రుతి చేసిన కామెంట్లకు ఖుష్బూ సమాధానమిచ్చింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో సీనియర్ దర్శకుడు సుందర్.సి తీస్తున్న సంఘమిత్ర నేపథ్యంలో ఈ ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేసింది.
సంఘమిత్ర కోసం సుందర్ చాలాకాలంగా వర్క్ చేస్తున్నారు. యం రవి - ఆర్యలను హీరోలుగా అనుకున్నారు. హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకుంటే.. ఆమె కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం సాధన చేసి, కేన్స్ లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో హడావుడి చేసి.. చివరికి హఠాత్తుగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఐతే తర్వాత కామ్ గా ఉండకుండా ఈ సినిమాపై కామెంట్లు చేసింది. సంఘమిత్ర సినిమా స్క్రిప్టు ఇంకా రెడీ కాలేదని, అందుకే తప్పుకున్నానని చెప్పింది. దీంతో సుందర్ భార్య ఖుష్బూ ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానమిచ్చింది. శ్రుతి పేరు చెప్పకుండానే సెటైర్లు వేసింది.
‘సంఘమిత్ర’ స్క్రిప్టు రెడీ కాలేదన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని.. ఈ సినిమాలో చేయడం కష్టమని భావించినవారు ఇందునుంచి తప్పించుకున్నారని అంది. సంఘమిత్ర చిత్రం ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటని... ఇలాంటి సినిమాలు సరైన ప్లానింగ్ లేకుండా చేయడం కుదరదని... సంఘమిత్ర స్క్రిప్టు రెడీ కాలేదని కొందరు చేస్తున్న కామెంట్లు వాస్తవం కాదని అంది. ఇలాంటి సినిమాల షూటింగుకి 30 శాతం సమయం పడితే.. షూటింగ్ చేయడానికంటే ముందు 70 శాతం సమయం పడుతుందని ఖుష్బూ అన్నారు. అనవసరంగా నిందలేయడం మానుకోవాలని... వారసులుగా రంగంలోకి దిగినవారు ఇలాంటి నిందలే వేయగలరు కానీ ప్రొఫెషనల్ గా ఉండలేరని అన్నారు. ఈ కామెంట్లన్నీ శ్రుతి టార్గెట్ గా చేసినవేనని కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.