లేడీ సూపర్ స్టార్ కొరియన్ రీమేక్.. క్రేజీ అప్డేట్!

Update: 2021-05-30 03:30 GMT
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార.. ప్రస్తుతం తమిళ తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ఇంకా తన హవా కంటిన్యూ చేస్తున్నారు. అలాగే భారీ పారితోషికం కూడా అందుకుంటుంది. దాదాపు పదమూడేళ్లకు పైగానే దక్షిణాది సినిమాలలో నటిస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది ఈ భామ. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చిన నయన్.. కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. గ్లామర్ షో తగ్గించేసి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ పోతుంది. తాజాగా నయనతార నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ నెట్రికన్. కొరియన్ 'బ్లైండ్' అనే మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఫస్ట్ టైం నయనతార ఈ సినిమాలో అంధురాలిగా కనిపించనుంది.

అయితే ఫస్ట్ టైం అమ్మడు ఓ ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసినట్లు తెలిపింది. కళ్లు లేని అమ్మాయిగా ఓ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది.. అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు 'గృహం' ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రౌ. మర్డర్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా టీజర్ గతేడాది నవంబర్ లోనే విడుదలై సినిమా పై అంచనాలు పెంచేసింది. అయితే ఈ రీమేక్ సినిమాను క్రాస్ పిక్చర్స్ వారితో కలిసి రౌడీపిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్నాడు. అదేవిధంగా ఇటీవలే పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు నెట్రికన్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈసారి నయనతార పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్ లో రాబోతుందని అర్ధమవుతుంది.

ఎందుకంటే పోస్టర్ చూస్తేనే సినిమాలో నయనతార చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సస్పెన్సు థ్రిల్లర్ మూవీలో నయనతార ఓ పోలీస్ అధికారి కాగా ఓ ప్రమాదంలో తన చూపు కోల్పోతుందని టాక్ నడుస్తుంది. అయితే ఫస్ట్ లుక్ - టీజర్స్ తో ఆసక్తి రేపిన ఈ నెట్రికన్ మూవీ.. త్వరలోనే ఓటిటి రిలీజ్ కాబోతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా నిర్మాత విఘ్నేశ్ శివన్ త్వరలోనే ఈ సినిమా నుండి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని తెలిపాడు. ఈ సినిమా గురించి పక్కనపెడితే.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కూడా నయనతార 'కాతువకుల రెండు కాదల్' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి - సమంత కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నయనతార సూపర్ స్టార్ అన్నాతే సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News