కోలీవుడ్ లో ప్రస్తుతం కీర్తి సురేష్ లేడీ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ఇదే సమయంలో నయనతార లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద జోరు యాత్ర కొనసాగిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబో మూవీ రావడం నిజంగా ఆశ్చర్యకరం. వీరిద్దరిని కలిపి ఒకే సినిమాలో రజినీకాంత్ చూపించబోతున్నాడు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటిస్తు ఉండగా ఈ ఇద్దరు హీరోయిన్స్ తో పాటు ఖుష్బు మరియు మీనాలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కరోనా ముందు వరకు ఈ చిత్రంను రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటే అది సాధ్యం అయ్యేలా లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు రజినీకాంత్ షూటింగ్ కు హాజరు అయ్యేందుకు ఆసక్తిగా లేడు. వచ్చే ఏడాది వరకు షూటింగ్ లో పాల్గొనలేను అంటూ రజినీకాంత్ ప్రకటించాడు. దాంతో సినిమా గురించి జనాల్లో చర్చ తగ్గింది. ఇలాంటి సమయంలో సినిమాలో కీర్తి సురేష్ మరియు నయనతార పాత్రల గురించి ఒక పుకారు మళ్లీ సినిమా గురించి చర్చ జరిగేలా చేసింది.
ఆ పుకారు ప్రకారం ఈ చిత్రంలో నయనతారకు కీర్తి సురేష్ కూతురు పాత్రలో కనిపించబోతుంది. గతంలో నయన్ తల్లి పాత్రలో కనిపించింది. కాని అంత పెద్ద వయసు అమ్మాయికి నయన్ తల్లిగా నటించేందుకు ఎలా ఒప్పుకుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఇది నిజమేనా కాదా అనేది చర్చనీయాంశంగా ఉంది. కీర్తి సురేష్ మరియు నయనతార అభిమానులు ఈ పుకారును తెలికగా కొట్టి పారేస్తున్నారు. కాని కోలీవుడ్ వర్గాల వారు మాత్రం చాలా బలంగా ఈ విషయాన్ని చెబుతున్నారు. మరి ఏది నిజం అనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ సభ్యులు నోరు తెరవాలి లేదంటే సినిమా విడుదల అవ్వాల్సిందే.