లేడీ సూప‌ర్ స్టార్లు పారితోషికం క‌హానీ

Update: 2019-11-12 01:30 GMT
సౌత్ హీరోయిన్ల‌లో నెంబ‌ర్ -1, నెంబ‌ర్ -2 స్థానాల్లో కొన‌సాగారు న‌య‌న‌తార‌.. అనుష్క. న‌య‌న్ నెంబ‌ర్ -1 గా ఉంటే.. అనుష్క నెంబ‌ర్ -2 అన్న భావ‌న ఉండేది. ఈ ర్యాకింగ్స్ కి కొల‌మానం ఏమిటి అంటే..? ఆ ఇద్ద‌రూ చేస్తోన్న సినిమాలు.. క్రేజును బ‌ట్టే ఇవ‌న్నీ డిసైడ్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం  కోలీవుడ్ ని న‌య‌న్ ఏల్తుంటే...టాలీవుడ్ లో అనుష్క వ‌రుస‌గా సినిమాలు చేయ‌క‌పోయినా త‌న స్థాయిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ ఇద్ద‌రు సెల‌క్టివ్ గానే వెళ్తున్నారు. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌తోనూ మెప్పిస్తున్నారు.

తాజాగా వీళ్లిద్ద‌రి పారితోషికాల్లో వ్య‌త్యాసం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. ప్ర‌స్తుతం న‌య‌న‌తార ఒక్కో సినిమాకు 6 కోట్లు ఛార్జ్ చేస్తోంది. భాష‌తో సంబంధం లేకుండా పేమెంట్ ప‌క్కాగా ఉంటేనే డీల్ ఒకే చేస్తోంది. కొన్నిటికి కండిష‌న్లు అప్ల‌య్ అంటోంది. ఇట‌వ‌లే పాన్ ఇండియా చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`లో  న‌టించిన న‌య‌న్ కు 5 కోట్ల‌కు పైగానే పారితోషికం చెల్లించిన‌ట్లు  రూమ‌ర్లు వ‌చ్చాయి. త‌మిళంలో ఒక్కో సినిమాకి 6 కోట్లు అందుకుంటుంది అన్న దాంట్లో వాస్త‌వం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు సైతం ధృవీక‌రించాయి. ఇక అనుష్క పారితోషికం రేంజు ఎంత‌? అంటే.. ప్ర‌స్తుతం న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రం `నిశ్శ‌బ్దం`కు 3.5 కోట్లు వ‌సూలు చేస్తోంద‌ట‌.

బాహుబ‌లి త‌ర్వాత స్వీటీ సోలో నాయిక‌గా న‌టించిన‌ భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత‌ అనుష్క రెమ్యున‌రేష‌న్ లో ఈ మార్పు తీసుకొచ్చింద‌ట‌. బాహుబ‌లికి ముందు అనుష్క ఒక్కో సినిమాకు  కొటిన్నర నుంచి రెండు కోట్లు అందుకునేది. తాజాగా బాహుబ‌లి ఇమేజ్ తోనే ఈ హైక్ అని తెలుస్తోంది. అలాగే  ప్ర‌స్తుతం అనుష్క న‌టిస్తోన్న నిశ్శ‌బ్ధం మూడు భాష‌ల్లో చేయ‌డం..  క‌థ ఎక్కువ‌గా భాగం త‌న‌ చుట్టూనే తిరుగుతుంది అన్న కార‌ణంగానూ పారితోషికం పెంచిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ రూమ‌ర్ కూడా వినిపిస్తోంది. భాగ‌మ‌తి త‌ర్వాత అనుష్క కొంచెం గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ కి  కార‌ణంగా రెమ్యున‌రేష‌న్ హైక్ కావాల‌నుకోవ‌డ‌మేన‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. ఏది ఏమైనా న‌య‌న‌తార‌- అనుష్క పారితోషికాల్లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌గానికి స‌గం వ్య‌త్యాసం ఉన్నా.. స్వీటీ స్పీడ్ పెంచితే ఇంకా హైక్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News