ఫస్ట్ ఇంపాక్ట్ తో నరాలు తెగేలా అంచనాలను రేపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అయితే రీసెంట్ గా మీడియా సమావేశాన్ని నిర్వహించిన సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా కంటే ఎక్కువగా అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
ఏకంగా ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటూ ప్రశంసలను అందించారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం చాలా ప్లస్ అని చెబుతూ బాలీవుడ్ ఫెమాస్ మ్యూజిక్ డైరెక్టర్స్ జోడి విశాల్ - శేఖర్ అద్భుతమైన పాటలను అందించారని చెప్పారు. వారు కేవలం బన్నీ కోసమే ఈ సినిమా ఒప్పకున్నట్లు తెలిపారని శ్రీధర్ వివరించారు. ఇంకా శ్రీధర్ ఏమన్నారంటే.. సినిమా బడ్జెట్ లిమిట్ లేకుండా చాలా ఉన్నతంగా తెరకెక్కించడం జరిగింది. ఇంకో 25 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
అయితే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేసి సైనికులకు అంకితం ఇవ్వనున్నాం. రామ జోగయ్య శాస్త్రి గారు రాసిన పాట చాలా గొప్పగా ఉంటుంది. అందుకు తగ్గట్టు మ్యూజిక్ కూడా ఉంటుంది. సినిమాల్ అల్లు అర్జున్ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అతని నటన డ్యాన్స్ యాక్షన్ సీన్స్ లో బాడీ లాంగ్వేజ్ ఒక్కోటి ఒక్కో తరహాలో ఉంటుందని ఫైట్స్ కూడా చాలా బావుంటాయని శ్రీధర్ వివరించారు. ఇక ఫిబ్రవరి లో కూడా మరొక సాంగ్ రిలీజ్ చేసి ఫైనల్ గా ఏప్రిల్ లో అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.