టాలెంట్ అనేది ఉంటే అది దాగదు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా జెనరేషన్లో. ఆంధ్రాలోని ఒక మారుమూల పల్లెటూర్లో బేబీ అనే ఓ మధ్యవయసు మహిళ యధాలాపంగా ఒక పాట పాడడం.. ఆ పాటను ఎవరో ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఏకంగా సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ వీడియోను షేర్ చేయడంతో ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది.
పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రఘు కుంచె ఇప్పటికే బేబీకి ఒక అవకాశం ఇస్తానని ఫోన్లో హామీ ఇచ్చారట. ఆయన తన మాట నిలబెట్టుకుంటూ తన స్టూడియోలో ఒక పాటను రికార్డ్ చేయించాడు. ఈ పాట ఏ సినిమాకోసం అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదుగానీ.. ఈ పాటకు సాహిత్యం అందించింది మాత్రం లక్ష్మీ భూపాల. ఈ రచయిత పాట లిరిక్స్ గురించి వెల్లడిస్తూ ఈ పాటను బేబీ స్ఫూర్తితోనే రాయడం జరిగిందని.. లిరిక్స్ ఆమె గురించే ఉంటాయని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. అంతే కాదు ఈ విషయాన్ని ఆమెకు తెలిపితే.. ఎమోషనల్ అయిందని కూడా వెల్లడించాడు.
మరోవైపు ఈ సోషల్ మీడియా సెన్సేషన్ ను మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఈమధ్యే కలిశాడు. చిరంజీవి సతీమణి బేబీ విషయం తెలుసుకొని చిరంజీవికి చెప్పడంతో.. సంగీత దర్శకుడు కోటి ద్వారా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారట. మ్యూజిక్ డైరెక్టర కోటి కూడా బేబీ కి ఒక అవకాశం ఇస్తున్నాడని సమచారం. ఏదేమైనా సోషల్ మీడియా ద్వారా ఒక మట్టిలో మాణిక్యంలాంటి గాయనికి ఇలాంటి అవకాశం రావడం గొప్ప విషయమే.