వీడియో: 'లక్ష్య' సాధనలో శౌర్య కు తోడుగా నిలిచిన విలక్షణ నటుడు..!

Update: 2021-11-06 09:47 GMT
యువ హీరో నాగ శౌర్య నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో తెరకెక్కుతున్న మొట్ట మొదటి సినిమా ఇది. 'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలక్షణ నటులు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.

ఇప్పటివరకు 'లక్ష్య' సినిమా నుంచి విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఓ లక్ష్యం' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'అరచేతుల్లో దాచి వెలగించే దీపం తానే.. కనుపాపల్లే కాచి నడిపించే లోకం తానే..' అంటూ సాగిన ఈ గీతం వీక్షకులను అలరిస్తోంది. లక్ష్య సాధనలో నాగశౌర్య కు జగపతిబాబు సహాయం చేయడాన్ని ఈ పాటలో చూడొచ్చు.

జగపతి బాబు - నాగశౌర్య మధ్య అనుబంధాన్ని.. ఎమోషన్స్ ను చూపిస్తూ ఈ పాట సాగింది. ఇంటి వద్ద రెగ్యులర్ గా చేసే పనులతో శౌర్య ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి తనయుడు కాలభైరవి 'ఓ లక్ష్య' పాటకు స్వరాలు సమకూర్చారు. రెహమాన్ సాహిత్యం అందించగా.. హిమ్మత్ మహ్మద్ ఈ గీతాన్ని ఆలపించారు.

'లక్ష్య' సినిమాలో నాగశౌర్య ఇంతకు ముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా కనిపించడానికి కఠోరమైన వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని సిద్ధం చేసాడు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న శౌర్య మైలురాయి 20వ చిత్రం కచ్చితంగా సక్సెస్ అందిస్తుందని ధీమాగా ఉన్నారు.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ పతకాలపై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Full View




Tags:    

Similar News