వీడియో : లాల భీమ్లా అదరగొట్టేశాడు

Update: 2021-11-07 07:07 GMT
పవన్‌ కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ తో ఏ రేంజ్ మాస్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఇవ్వబోతున్నాడో ఇప్పటికే చెప్పకనే చెప్పారు. తాజాగా లాల భీమ్లా పాటతో ఆ విషయాన్న మరింతగా చెప్పారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా నేడు ఈ పాటను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు త్రివిక్రమ్‌ సాహిత్యంను అందించడం జరిగింది. డైలాగ్స్ మాత్రమే రాసే త్రివిక్రమ్‌ ఈ పాట కోసం తన సాహిత్యంను అందించడం జరిగింది. థమన్‌ పై పెట్టుకున్న నమ్మకం నిలుపుకునే విధంగా ఆకట్టుకునే మాస్ బీట్ ను ఇచ్చాడు. పాట పాడిన అరుణ్‌ కౌండిన్య అభిమానులకు పూనకాలు తెప్పించాడు అనడంలో సందేహం లేదు. పాట ఇంకాస్త సమయం ఉంటే బాగుండేది అన్నట్లుగా ఈ పాట సాగుతుంది.

థమన్‌ ఏ రేంజ్ లో పవన్ సినిమా భీమ్లా నాయక్ పై ఫోకస్ పెట్టాడో ఈ పాటను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇప్పటికే వచ్చిన పాటలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ పాట నిలిచింది. పవన్ కళ్యాణ్ పాత్రను తెలియజేసే పాట ఇది. ఆకట్టుకునే లైన్స్ తో సాగిన ఈ పాటకు అద్బుతమైన విజువల్స్ తోడు అయ్యాయి. ఈ పాట కోసం ప్రత్యేకంగా డాన్సర్స్ తో చేయించిన విజువల్స్ కన్నులకు వింధుగా ఉన్నాయి. సినిమాలో పాట ఏ సందర్బంలో వస్తుందో ఊహించుకోవచ్చు. పవన్ పాత్రను హైలైట్ చేయడంలో ఖచ్చితంగా ఈ పాట కీలకం అవుతుందని అంటున్నారు.

మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్ గా రూపొందిన భీమ్లా నాయక్‌ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే మరియు డైలాగ్స్ ను అందించాడు. పవన్‌ మరియు రానాలు కలిసి నటించడం వల్ల సినిమాపై అంచనాలు ఎప్పటి కంటే ఎక్కువగా ఉన్నాయి. పవన్ మరియు రానాల మద్య వచ్చే సన్నివేశాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్‌ మూవీగా మార్చేశారు. వకీల్‌ సాబ్‌ ను ఎలా అయితే కమర్షియల్‌ రీమేక్ గా మార్చారో అచ్చు ఈ సినిమాను కూడా హీరో సెంట్రిక్‌ మూవీగా మార్చేశారు.

పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం ఈ సినిమా మరో ప్రత్యేకత అనుకోవచ్చు. భీమ్లా నాయక్ భార్య పాత్రకు ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అందుకే ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారు. సంక్రాంతికి అనుకున్న ఈ సినిమా ఆర్ ఆర్‌ ఆర్ వల్ల ఆలస్యం అయ్యేలా ఉంది. తాజాగా విడుదల అయిన పాటలో సంక్రాంతికి అంటూ లేదు కనుక కాస్త ఆలస్యంగా విడుదల అవుతుంది దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే.

Full View
Tags:    

Similar News