శుభాకాంక్షలకు ఈ ఉచిత సలహాలేంటి భయ్యా..!

Update: 2022-07-18 07:31 GMT
బాలీవుడ్ సీనియర్ స్టార్‌ నటి సుస్మితా సేన్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పిన లలిత్‌ మోదీ ఇటీవల సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారుతున్నాడు. సోషల్‌ మీడియా లో సుస్మితా సేన్ తో ఉన్న ఫోటోలను ఈయన షేర్‌ చేసిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అందులో కొందరు స్టార్స్.. సెలబ్రెటీలు కూడా ఉండటం విశేషం.

లలిత్ మోదీ పోస్ట్‌ కు బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌ వీర్ సింగ్ స్పందించాడు. రెండ్‌ హార్ట్‌ ఈమోజీని షేర్‌ చేయడం తో పాటు శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా కామెంట్‌ చేయడం జరిగింది.

ఆ కామెంట్‌ కాస్త అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త ఆలస్యం అయినా రణ్‌ వీర్ సింగ్ కామెంట్ కు లలిత్ మోదీ స్పందించారు. రణ్వీర్‌ సింగ్ పోస్ట్ కు లలిత్‌ మోడీ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

ట్విట్టర్ లో రణ్వీర్ సింగ్ ను ఉద్దేశించి లలిత్ మోదీ... మీ యొక్క గొప్ప శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఐపీఎల్ లేనందుకు క్షమించండి. నేను చెప్పేది మీ యొక్క సమయం ఆదాకు పని చేస్తుందని.. మీకు ఇష్టమైన పనిని చేసేందుకు వినియోగిస్తారని ఆశిస్తున్నాను. మనం మళ్లీ యూరప్ లో కలవడం కోసం వెయిట్‌ చేస్తున్నాను. మీరు పెద్ద నిర్మాతలకు ఏది కూడా ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు.

జనాలు చూసేది మిమ్మల్ని మాత్రమే అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అంటూ కమర్షియల్‌ పాఠాలను లలిత్‌ మోదీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ ఉచిత సలహా ఎందుకు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ట్విట్టర్ లో రణ్వీర్‌ సింగ్ ను ఉద్దేశించి లలిత్ మోడీ ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదో శుభాకాంక్షలు చేప్తే ఇలా ఉచిత సలహాలు ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్‌ అంటూ తీసుకు వచ్చి ఇండియన్ క్రికెట్‌ గతిని మార్చేసిన ఈయన రణ్వీర్ సింగ్ కు కూడా కమర్షియల్‌ పాఠాలు ఇలా చెబుతున్నాడేమో.
Tags:    

Similar News