ఫెరారి కార్లను కూడా బ్లాస్ట్ చేసేశారు

Update: 2018-05-29 07:07 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ప్రతి సినిమాకు స్థాయిని పెంచుకునేలా వెళుతున్నాడు. రిజల్ట్ ఎలా ఉన్నా కుడా క్రేజ్ పెరుగుతూనే ఉంది. సల్మాన్ తో ఒక్క సినిమా చేస్తే చాలు సెట్ అయిపోవచ్చు అని నిర్మాతలు క్యూ లో ఉన్నారు. ఇకపోతే ఖర్చు కూడా సల్మాన్ సినిమాలకు గట్టిగా ఉంటుంది. రేస్ 3 సినిమా కోసం అయితే ఎప్పుడు లేని విధంగా భారీ ఖర్చు చేశారు. దర్శకుడు రెమో డి సౌజా ఆలోచనలు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి మరి.

ఎంత కాస్ట్లీగా అంటే.. అబుదాబిలో చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో నిజమైన ఖరీదైన కార్లను వాడారు. ఎదో రెంట్ కి తెచ్చి వాడారు అనుకుంటే పొరపాటే. తీసుకు వచ్చిన కార్లు మళ్లీ వెనక్కి ఇవ్వడం కుదరదని దర్శకుడు ముందే చెప్పాడట. ఎందుకంటే అది రియల్ రేజింగ్ లా చిత్రీకరించాలి. చివరికి బ్లాస్ట్ అవుతాయి కాబట్టి వెనక్కి వచ్చే అప్షన్ లేదు అన్నారట. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్  లో తెలిపింది.

ఆ కార్లు కూడా మాములు కార్లు కావు. ఫెరారీ - లంబోర్ఘిని - మసెరటి మరియు ఆస్టన్ మార్టిన్. ఈ కార్లు ఎంత ఖరీదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఆ కార్లను పైకి ఎగరేసి మరి పేల్చేశారట. దాన్ని ఆనవాళ్లు దర్శకుడు రెమో తన ఆఫీస్ లో దాచుకున్నట్లు చెప్పాడు. మరి ఈ స్థాయిలో ఖర్చు పెట్టించిన ఈ సినిమా విడుదల తరువాత ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో చూడాలి.    


Tags:    

Similar News