ఫోటో స్టోరి: మిర్ర‌ర్ సెల్ఫీతో తిక్క చూపిస్తోంది!

Update: 2021-01-30 03:30 GMT
లారిస్సీ బోనేసి.. ఎక్క‌డో ఈ పేరు విన్న‌ట్టుందే అనుకుంటున్నారా?  సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న `తిక్క` చిత్రంలో న‌టించింది. ఆ మూవీలో వెన్నెల కిషోర్ ప్రేమ డ‌మ్మీ అని ప్రూవ్ చేసేందుకు హోట‌ల్లో బాంబ్ పెట్టారంటూ సాయి ధ‌ర‌మ్ నాట‌కం ఆడి చివ‌రికి లారెస్సి మ‌నసు గెలిచేసుకుంటాడు. ఆపై క‌థేంటో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అదంతా స‌రే కానీ ఆ సీన్ లో ఎస్.. నో.. ప‌ద ప‌ద ప‌ద బాంబ్ పెట్టారు! అంటూ గారాలు పోయే లారెస్సీ ర‌బ్బరు బొమ్మ‌నే త‌ల‌పిస్తుంది కానీ న‌టి అని అనిపించ‌దు. అందుకే ఆ త‌ర్వాత టాలీవుడ్ లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. దుర‌దృష్ట వ‌శాత్తూ ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డం కూడా త‌న‌కు మైనస్ అనే చెప్పాలి.

ఇక‌పోతే బ్రెజిలియ‌న్ మోడ‌ల్ లారిస్సా య‌థావిధిగా త‌న మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో బిజీ బిజీ. ఇన్ స్టా వేదిక‌గా అందుకు సంబంధించిన వీడియోల్ని ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ మిర్ర‌ర్ సెల్ఫీని షేర్ చేసింది ఈ బ్యూటీ. నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ హాట్ లుక్ తో లారెస్సి మైమ‌రిపిస్తోంది. అంతకుముందు బంగారు ఆభ‌ర‌ణాల ప్ర‌క‌ట‌న‌లో ఎంతో సాంప్ర‌దాయ బద్ధంగా క‌నిపించిన ఆమె‌కు తాజా ఫోటోలో లుక్ కి అస్స‌లు పోలికే లేదు! అంటూ యూత్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.
Tags:    

Similar News