చివరగా శ్రీదేవి అలా కనిపించింది

Update: 2018-02-25 06:40 GMT
ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా శ్రీదేవి చర్చే. ఇంత హఠాత్తుగా ఆమె కాలం చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దుబాయిలో బంధువులకు సంబంధించి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లి.. పెళ్లిలో కూడా పాల్గొని ఆ తర్వాత హోటల్‌ గదికి వెళ్లిన శ్రీదేవి రాత్రి 11.30 ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీదేవికి గుండెపోటు రావడం ఇదే తొలిసారి అంటున్నారు. మరి పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీదేవికి అంతలోనే ఏం ఇబ్బంది వచ్చింది.. అంతటి తీవ్ర అనారోగ్యానికి ఎందుకు గురైంది అన్నది అర్థం కావడం లేదు.

శ్రీదేవి చనిపోవడానికి కొన్ని గంటల ముందు చిన్న కూతురితో కలిసి దిగిన ఫొటోలతో పాటు.. పెళ్లి వేడుకలో అతిథుల్ని పలకరిస్తూ తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాది సంప్రదాయ దుస్తులు ధరించిన శ్రీదేవి ఆ పెళ్లి వేడుకలో అతిథులు తనకు నమస్కరిస్తుంటే తల ఊపుతూ ప్రతిగా అభివాదం చేయడం.. తర్వాత ఎవరినో చూస్తూ నోటికి చేయి దగ్గరగా పెట్టుకుని ఊపడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియోలో శ్రీదేవి కొంచెం అసౌకర్యంగా ఉన్న సంగతి ముఖంలో కనిపిస్తోంది. అప్పటికే ఆమెకు ఒంట్లో ఇబ్బంది మొదలై ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేడుక ముగిశాక అందరూ తమ గమ్య స్థానాలకు బయల్దేరగా శ్రీదేవి కుటుంబం మాత్రం హోటల్ గదికి వెళ్లింది. అక్కడే ఘోరం జరిగిపోయింది.

Full View

Tags:    

Similar News