ఇర్ఫాన్ చివరి సినిమాకు మోక్షం..!

Update: 2023-06-27 16:01 GMT
బాలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ తన మార్క్ నటనతో సినీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ ఏదైనా పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. బాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలు అన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో ఇర్ఫాన్ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. దురదృష్టవశాత్తు అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి సినీ ప్రియులను షాక్ అయ్యేలా చేసింది.

ఇర్ఫాన్ ఖాన్ నటించిన సినిమాలు చూస్తూ గొప్ప మనిషిని కోల్పోయామని ఇర్ఫాన్ అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఇర్ఫాన్ నటించిన ఒక సినిమా రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే ఉండిపోయింది. అదే అప్నో సే బెవఫాయి. ప్రకాష్ భలేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోనే ఇర్ఫాన్ ఖాన్ చివరగా నటించారు. 3 ఏళ్లుగా రిలీజ్ కి మోక్షం కలగని ఈ సినిమా జూన్ 29న రిలీజ్ చేస్తున్నారు.

ఇర్ఫాన్ ఖాన్ 2020లో మృతి చెందగా ఆయన కాలం చేశాక 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇక అప్నో సే బెవఫాయి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో  నటుడవ్వాలని కోరికతో ముంబైకి వచ్చి ఈజీ మనీ కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఇర్ఫాన్ ఖాన్.

ఈ టైం లో అతను తన ఫ్యామిలీతో పాటు చాలా దూరం చేసుకుంటాడు. ఈజీ మనీ తెచ్చే ప్రమాదాలు ఈ సినిమాలో చూపించారు. కాస్టింగ్ అంత గొప్పగా ఏమీ ఉండదు కానీ ఈ సినిమా బలమైన ఎమోషన్స్ తో ఉంటుందని తెలుస్తుంది.

ఇర్ఫాన్ ఖాన్ మహేష్ గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన సైనికుడు సినిమాతో తెలుగు తెర మీద అలరించారు. ఆ సినిమా సక్సెస్ అందుకోకపోవడంతో టాలీవుడ్ వైపు ఆసక్తి చూపించలేదు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన సినిమాల్లో తల్వార్, లైఫ్ ఆఫ్ పై, హిందీ మీడియం సినిమాలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందాయి.

హాలీవుడ్ సినిమా ఇన్ఫెర్నో లో కూడా ఆయన నటించారు. ఇర్ఫాన్ మరణించిన 3 ఏళ్ల తర్వాత ఆయన చివరి సినిమా రిలీజ్ అవడం ఆ మహా నటుడిని ఇష్టపడే వారికి సర్ ప్రైజ్ చేస్తుంది. ఎన్నో గొప్ప సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఇర్ఫాన్ ఖాన్ చివరి సినిమా అప్నో సే బెవఫాయి కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.

Similar News