ఆ ఒక్క హిట్టు స‌రే ఇకనైనా నిల‌బెట్టుకుంటుందా?

Update: 2022-02-24 04:46 GMT
ఎవ‌రికైనా ఒకే ఒక్క‌సారి అదృష్టం త‌లుపు త‌డుతుంది. దానిని స‌ద్వినియోగం చేసుకుని దూసుకుపోవ‌డంలోనే ఉంటుంది అస‌లు ట్విస్టు. చాలామంది త‌డ‌బ‌డేది ఇక్క‌డే.

అందం ప్ర‌తిభ ఉన్నా చాలామంది క‌థానాయిక‌లు ఒక‌ట్రెండు సినిమాల‌కే తెర‌మ‌రుగ‌వ్వ‌డం వెన‌క ప్రణాళిక లేక‌పోవ‌డ‌మే కార‌ణం. హిట్టొచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక చాలామంది నాయిక‌లు ప‌రిశ్ర‌మ నుంచి వైదొల‌గిపోతుంటారు.

కానీ ఇప్పుడు నేహా శెట్టికి టైమ్ వ‌చ్చింది. డీజే టిల్లు హిట్టు కొట్ట‌డంతో టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

పూరి త‌న‌యుడితో మెహబూబా లో న‌టించిన ఈ బ్యూటీ తొలి ప్ర‌య‌త్నం ఫ్లాప్ అందుకుంది. సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ చేసిన ఈ నటి డీజే టిల్లూతో చాలా మంది ఫాలోవ‌ర్స్ ని సంపాదించింది. సిద్ధు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆమె యూత్ ఫుల్ రోల్ తో ఆక‌ట్టుకుంది. నేహా స్క్రీన్ ప్రెజెన్స్ స‌హా న‌ట‌న‌తో రొమాంటిక్ మూవీకి వెయిట్ పెరిగింది.

నేహా శెట్టి ప్రస్తుతం వ‌రుస‌ ప్రాజెక్ట్‌ల కోసం సంతకం చేయడానికి చర్చలు జరుపుతోందని స‌మాచారం. స్క్రిప్ట్ త‌న‌ పాత్రకు చాలా ప్రాముఖ్యతనిస్తోందిట‌.  

ఇతర భాషల నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని స‌మాచారం. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక‌పోతే దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకునే దిశ‌గా నేహా అడుగులు పడుతున్న‌ట్టే. అయితే ప్ర‌ణాళిక ప్ర‌మోష‌న్ చాలా ఇంపార్టెంట్. ఆ దిశ‌గా బ‌లగాన్ని పెంచుకునే ప‌నిలోనూ ఉంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News