కేవలం నెల రోజుల గ్యాప్ లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ సంచలన విజయం నమోదు చేయడంతో ఎంతో జోష్ తో ఉన్నాడు చరణ్ .. పాన్ ఇండియా వార్ లో ప్రభాస్ - బన్నీలకు ధీటుగా ఇప్పుడు సత్తా చాటేందుకు తెలివైన ఎత్తుగడలతో దూసుకెళుతున్నాడు. ఇంతలోనే ఇప్పుడు తన తండ్రి గారైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా ఈ సినిమా ఆర్.ఆర్.ఆర్ విడుదలైన నెల రోజుల్లోనే థియేటర్లలోనే విడుదలవుతోంది. అంటే చరణ్ అభిమానులకు ఇది తక్కువ సమయంలో డబుల్ ధమాకా ట్రీట్ అని చెప్పాలి.
ఆచార్య రాక కోసం మెగాభిమానులు సినీ ప్రేక్షకులు ఏడాది కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇక చరణ్ - చిరు కలిసి పూర్తి సినిమాలో ఎప్పుడూ నటించింది లేదు.
ఒకరి సినిమాలో ఒకరు కేవలం క్యామియోలు చేస్తూ కనిపించారు. కానీ ఈసారి అలా కాదు. దాదాపు పూర్తి సినిమాలో మెగా తండ్రి కొడుకులు కలిసి నటించారు. నిర్మాత అన్వేష్ రెడ్డి లీకులు ప్రకారం.. చిరు- రామ్ చరణ్ కలిసి ఉన్న ప్రతి ఫ్రేమ్ అలరిస్తుందని స్క్రీన్ టైమ్ పెద్దగానే ఉందని తెలిపారు. తండ్రీ కొడుకులు కలిసి దాదాపు 25 నిమిషాల స్క్రీన్ టైమ్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. తాజా వార్తతో ఇప్పుడు అభిమానులకు పూనకాలు ఖాయమేనని అర్థమవుతోంది. ఆచార్య కోసం వేచి చూసేవారికి ఇది మరింత ఉత్సాహం నింపేదేననడంలో సందేహం లేదు.
వాస్తవానికి చిరు-చరణ్ వ్యక్తిగతంగా సినిమా అంతటా అనేక సన్నివేశాలను కలిగి ఉన్నారు. అయితే సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు ఆ ఇద్దరూ కలిసి స్క్రీన్ ను పంచుకుంటారు అని అన్వేష్ రెడ్డి ధృవీకరించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే -కాజల్ అగర్వాల్ నటన కూడా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఉంటుందని సమాచారం.
పూజా ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. హాఫ్ శారీతో దుమారం రేపుతుంది. ఇంతకుముందు పూజా చరణ్‌తో కలిసి రంగస్థలంలో ప్రత్యేక పాటలో మాత్రమే కనిపించింది. వీరిద్దరూ ఇప్పుడు ఆచార్యలో మొదటిసారిగా తమ కెమిస్ట్రీని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. చరణ్ -పూజ నడుమ రొమాన్స్ అప్పుడప్పుడు మాస్ కి పూర్తి రిలీఫ్ ట్రీట్ గా ఉంటుందట. ఇటీవల రిలీజ్ చేసిన పుట్టినరోజు పోస్టర్ లో చరణ్ లుక్ కి అభిమానలు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిరంజన్‌రెడ్డి- అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సోనూ సూద్- జిషు సేన్ గుప్తా- వెన్నెల కిషోర్- పోసాని కృష్ణ మురళి- తనికెళ్ల భరణి- అజయ్- బెనర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ఎస్ తిరునావుకరసు ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.