కృష్ణ చైతన్య - పావని ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తాజా చిత్రం ''ప్రయాణికుడు''. 'అమరం అఖిలం ప్రేమ' ఫేమ్ జోనాధన్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇన్ఫీనిట్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఎమ్.కృష్ణ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. జాబ్ కోసం సిటీకి వచ్చిన ఓ మెకానిక్.. అనుకోని పరిస్థితుల్లో నేర ప్రపంచంలోకి వెళ్లి ఎలాంటి ప్రయాణం సాగించాడు అనేది ఈ సినిమా కథ. రేపు మంగళవారం (ఏప్రిల్ 13) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో 'ప్రయాణికుడు' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ వస్తున్న అమెజాన్.. మరోసారి కంటెంట్ బేస్డ్ మూవీని స్ట్రీమింగ్ కి పెడుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. 'ప్రయాణికుడు' చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా.. పవన్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాహుల్ మాచినేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాయల హరిచంద్ర - వేణు పొలాసాని - బీపీ ప్రసాద్ - దాసరి నాగేశ్వరరావు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.