అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ధాటికి థియేటర్ల గ్లాస్ డోర్స్ పగిలిపోయిన సందర్భాలు, స్క్రీన్ లు చిరిగిపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్` మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మూడున్నరేళ్ల విరామం తరువాత పవన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. థియేటర్లలో జాతర వాతావరణాన్ని సృష్టించారు.
వీరి తాకిడి కారణంగా పలు థియేటర్ల అద్దాలు, ఎంట్రెన్స్ వద్ద వున్న గ్లాస్ డోర్స్ పగిలిపోయి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కూడా. ఇప్పడు ఇదే పరిస్థితి ట్రిపుల్ ఆర్ థియేటర్లకు రాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన థియేటర్ల యాజమాన్యాలు అందుకు తగ్గట్టుగా కట్టదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ శుక్రవారం ట్రిపుల్ ఆర్ అత్యంత భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. దాదాపు మూడున్నరేళ్ల తరువాత అభిమాన హీరోలు నటించి సినిమా కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు హల్ చల్ చేయబోతున్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు థియేటర్ల యాజమాన్యాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి మూడు నాలుగు రోజులు థియేటర్లలో అభిమానులు చేసే హంగామా మామూలుగా వుండదు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో తమకు పూనకాలు తెప్పించే సన్నివేశం మొదలైతే స్క్రీన్ ముందు భాగంలో వున్న స్టేజ్ పైకి ఎక్కేసి ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీని వల్ల చాలా డిస్టబెన్స్ కలుగుతుంటుంది. అంతే కాకుండా పొరపాటున ఎవరైనా టపాసు పేల్చి తెరపైకి విసిరేసారా తెరమొత్తం కాలి బూడిద అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన థియేటర్ సిబ్బంది ప్రత్యేకంగా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
మామూలుగా ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ సహజంగానే హల్ చల్ చేస్తుంటారు. ఇక ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా కావడంతో ఇద్దరు స్టార్ లకు చెందిన అభిమానులు రచ్చ చేస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటున్న థియేటర్ల వారు ఇందు కోసం ప్రత్యేకంగా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారట. అంతే కాకుండా ఈ మూవీపై మునుపెన్నటూ లేనంతగా హైప్ క్రియేట్ కావడం, బాహుబలి తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
దక్షిణాది, ఉత్తరాది అని కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో భారీ స్థాయిలో థియేటర్లకు ప్రేక్షకులు, అభిమానుల తాకిడి వుంటుందని గమనించిన థియేటర్ల వారు ముందు జాగ్రత్త చర్యగా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసుకుంటుండటం ఇప్పడు వైరల్ గా మారింది.