`బాహుబలి` తరువాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. రాఖీబాయ్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ హాలీవుడ్ చిత్రాలకి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కించడంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `కేజీఎఫ్ చాప్టర్ 2` పార్ట్ 1ని మించిన ప్రత్యేకతలతో అత్యంత భారీగా రూపొందింది.
గరుడని రాఖీ హత్య చేయడంతో తొలి భాగంని పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ 2న అంతకు మించిన రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసినా అన్ని చిత్రాల తరహాలోనే `కేజీఎఫ్ చాప్టర్ 2` కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అప్ డేట్ ఇచ్చింది. అంతకు ముందు ఏడాది యష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్ ఈ ఏడాది జనవరిలో మరో సారి యష్ పుట్టినరోజున సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
రీసెంట్ గా అభిమానులకు `కేజీఎఫ్ చాప్టర్ 2` నుంచి ట్రైలర్ కావాలా లేక పాట కావాలా? ఇందులో ఏది కావాలో కోరుకోమని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులని కోరారు. అయితే ఇందుకు సంబంధించిన అప్ డేట్ ని మాత్రం ఇవ్వలేదు. ట్రైలర్ లేదా? .. సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నది స్పష్టం చేయలేదు. టీజర్ రిలీజ్ చేసి ఏడాది కావస్తోంది. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
టీజర్ విడుదలై ఏడాది కావస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదని, ప్రేక్షకులు సినిమాని మర్చిపోతున్న నేపథ్యంలో మేకర్స్ కూడా తమ సినిమాని మర్చిపోయారా? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పలు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న వేళ తమ సినిమా ప్రమోషన్ ని మేకర్స్ పక్కన పెట్టారని అ కారణంగానే ఎలాంటి అప్ డేట్ ని ఇవ్వడం లేదనే విమర్శలు మొదలయ్యాయట.
పార్ట్ 2ని ఐదు భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట. ఇతర భాషలకు సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇప్పటికే కీలక టీమ్ మెంబర్స్ డబ్బింగ్ ని పూర్తి చేశారు. అయితే టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ .. లుక్ పోస్టర్ లాంటివి రాకపోవడంతో టీమ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందని, కేజీఎఫ్ రిలీజ్ మళ్లీ వెనక్కి వెళ్లిందని, ప్రేక్షకులు కూడా ఈ మూవీని మర్చిపోతున్నారని, మేకర్స్ కూడా స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లారంటూ నెట్టింట ప్రచారం మొదలైంది.
అంతే కాకుండా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ పై కూడా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై హోంబలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ ట్విట్టర్ వేదికగా స్పందించారు. `ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చే ప్రకటనలని దయచేసి నమ్మకండి. `కేజీఎఫ్ చాప్టర్ 2` కు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రానున్నాయి` అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.