కొంత మంది హీరోలు మొహమాటం కొద్దీ స్టోరీ నచ్చకపోయినా డైరెక్టర్ కోసమో లేక నిర్మాత కోసమో సినిమాలు చేసేస్తుంటారు. అలా చేసిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ లు అయితే అందులో ఎక్కువగా డిజాస్టర్ అయ్యాయి. వారి కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాలుగా నిలిచి పోయాయి. అలా మోహమాటం కొద్దీ ప్రభాస్ అంగీకరించిన సినిమాలు వున్నాయట. అందులో ఓ సినిమా గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అదే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణశంశీ తెరకెక్కించిన `చక్రం`.
`వర్షం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రభాస్ `అడవి రాముడు` చిత్రంలో నటించారు. ఈ మూవీ ఫరవాలేదనిపించింది. ఆ వెంటనే చేసిన చిత్రం `చక్రం`. 2005 మార్చిలో విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాదితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్‌భంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తాజాగా బయటికి వచ్చాయి. కెరీర్ ప్రారంభం లో కొన్ని చిత్రాలని మొహమాటం కోసం చేసిన ప్రభాస్ ఈ చిత్రాన్ని ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా చేశారట.
ఈ ప్రాజెక్ట్ గురించి తెలియగానే చాలా మంది ఈ కాన్సెప్ట్ ని మన ప్రేక్షకులు అంగీకరించరు. అనవరంగా ఫ్లాప్ ని ఎదుర్కొవాల్సి వస్తుందని చాలా మంది హెచ్చరించారట. అయినా వినకుండా ప్రభాస్ ముందుకే వెళ్లి సినిమా చేశారు. ఫలితం భారీ ఫ్లాప్. ఈ మూవీని చేయొద్దని స్ట్రాంగ్ గా ప్రభాస్ కు చెప్పిన వారిలో మెగా స్టార్ చిరంజీవి, ప్రభాస్ వున్నారట. వీరు ఈ మూవీ ఆపేయమని ప్రభాస్ కు చెప్పారట. అయినా కొత్తగా వుంటుందనరి ప్రభాస్ ట్రై చేశారట.
ఆ తరువాత ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని తరుణ్, మహేష్ బాబు కూడా ప్రభాస్ తో చెప్పారట. మొహమాటానికి పోయి ప్రభాస్ ఈ మూవీ చేస్తానని ముందే మాటిచ్చేశారట. ఇచ్చిన మాట కోసం ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా సినిమా చేయడం, అది ఫ్లాప్ కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ కృష్ణవంశీ కెరీర్ లోనూ అత్యంత డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు, బయ్యర్లకు తీవ్ర నష్టాలని తెచ్చిపెట్టింది.
అయితే చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా సంగీత దర్శకుడు, స్వర చక్రవర్తి చక్రవర్తి తనయుడు శ్రీ ఆలపించిన `జగమంత కుటుంబం నాది..` ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. ప్రభాస్ కు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించిన ఈ చిత్రంలో అసిన్, చార్మి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ తరువాత గీత చిత్ర ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్స్ జి. శివరాజు, సి. వెంకటరాజు మరో సినిమా నిర్మించలేదు