ఎల్లోరా శిల్పం ఇంత అందంగా ఉంటుందా?

Update: 2022-02-23 11:41 GMT
అద్బుతమైన ఎల్లోర శిల్పం కూడా నీ అందం ముందు దిగదుడుపే అంటూ రకుల్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వారు చేస్తున్న కామెంట్స్ అతిశయోక్తి అనిపించడం లేదు. ఎందుకంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్ తాజాగా షేర్‌ చేసిన ఫోటోలు అలా ఉన్నాయి. ఆమె అభిమానులకు ఆమె ఎల్లోర శిల్పంను మించి అందంగా కనిపిస్తుంది కనుక ఆ విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

అందాల ఆరబోత విషయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చాలా ట్రెండీగా ఉంటుంది. ఏదో స్కిన్‌ షో చేసింది అన్నట్లుగా కాకుండా ట్రెండీ లుక్ లో అందంగా కనిపించడంతో పాటు స్కిన్‌ షో చేస్తుంది. ఆమె అద్బుతమైన అందం ఎప్పటికి కూడా అభిమానులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంటుంది. సినిమాల్లో ఎంతో అందంగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్‌ మీడియా ను షేక్‌ చేస్తుంది.

సౌత్‌ లో సినిమాలను తగ్గించి బాలీవుడ్‌ లోనే బిజీ అయ్యింది. సౌత్‌ లో స్టార్‌ హీరోలకు ఈమె ఒకప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌. కాని ఇప్పుడు కాదు. అందుకే బాలీవుడ్‌ లో ఈమె వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ అయిదు ఆరు సినిమాలు కమిట్‌ అయ్యి చేస్తోంది. మరి కొన్ని సినిమాలు కూడా కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల్లో రకుల్‌ అందాల ఆరబోత ఆ సినిమాల స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటున్నారు.

ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో రకుల్‌ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందమైన ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో మొహమాటం లేకుండా ఉంటుంది. అందుకే ఈమె ను అత్యధికులు ఫాలో అవుతున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్‌ లో దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో కూడా నటించింది. తమిళంలో కూడా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి.

ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఇతర స్టార్స్ మాదిరిగా రెగ్యులర్ గా ప్రియుడితో కలిసి చక్కర్లు కొట్టడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టడం చేయడం లేదు. పద్దతైన ప్రేమలో ఈమె ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక తనకున్న ఇమేజ్ ను చక్కగా బిజినెస్ లో వినియోగించుకుంటూ తన సన్నిహితులు కుటుంబ సభ్యులతో జిమ్‌.. హోటల్‌ ఇంకా ఇతర బిజినెస్ ల్లో రకుల్‌ పెట్టుబడి పెట్టి తెలివైన హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. అందం మరియు తెలివి రకుల్‌ ప్రీత్‌ సొంతం.
Tags:    

Similar News