కండోమ్ కంపెనీ ప్రమోషన్స్ లో RRR

Update: 2022-03-29 04:45 GMT
RRR పై క్విజ్ కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టైటిల్ ని వెల్ల‌డించిన వారికి కానుక‌లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు రాజ‌మౌళి. చివ‌రికి రౌద్రం ర‌ణం రుధిరం అంటూ టీమ్ ప్ర‌క‌టించింది. కానీ ప్ర‌జ‌ల‌కు ఈ టైటిల్ ఏమంత‌గా గుర్తు లేదు.  RRR గానే ఇది పాపుల‌ర్. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తోంది. భారీ వ‌సూళ్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఇక  RRR పేరుతో మార్కెట్లో బోలెడంత మ్యాజిక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే RRR దోసెలు పాపుల‌ర‌య్యాయి. టిఫిన్ సెంట‌ర్ల‌లో దీనిపై చ‌ర్చ సాగుతోంది.  RRR పేరుతో బోలెడ‌న్ని ఉత్ప‌త్తులు వెలిసాయి. మ‌ర్కండైల్ లో ఇది పాపుల‌ర్ నేమ్ గా మారింది. ఇక‌పోతే కండోమ్ ప్ర‌క‌ట‌న‌కు కూడా  RRR అక్క‌ర‌కొస్తోందంటే అర్థం చేసుకోవాలి. RRR అక్షరాలను ఉపయోగించుకుని అనేక అగ్రశ్రేణి బ్రాండ్ లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నా త‌మ బ్రాండ్ ప్ర‌చారానికి ఇది ప్ల‌స్ గా మారుతోంది.

భారతదేశంలోని ప్రసిద్ధ కండోమ్ బ్రాండ్ లలో ఒకటి అయిన `స్కోర్ కండోమ్‌` కూడా  RRRని ఉప‌యోగించుకుంది. ఇందులో కొన్ని స్పైసీ టీవీ వాణిజ్య ప్రకటనలు..డిజిటల్ ప్రచారాలు వేడెక్కిస్తున్నాయి. RRR `ఫైర్ అండ్ ఐస్` థీమ్ తో ఇప్పుడు స్కోర్ కండోమ్ లు ప్రచారం చేసుకుంటున్నాయి. RRRని వారి ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించుకున్నారు. RRRని రా రెస్పాన్సిబుల్ రొమాన్స్ గా సంక్షిప్తీకరించి ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌రం.

నిస్సందేహంగా బ్రాండ్ ప్రయోజనం కోసం ట్రెండింగ్ టాపిక్ ను ఉపయోగించడంలో ఇది ఒకటి. స్కోర్ కండోమ్ లు చాలా మంది మీమ్ మేకర్స్.. డిజిటల్ ప్రమోటర్లు.. ఈ చిన్న ప్రకటన ప్రచారంపై హోరెత్తించ‌డం విశేషం. అయితే RRR బ్రాండ్ ని ఇలా వినియోగించ‌డంపై క్లెయిమ్ చేయొచ్చా? అంటే మేక‌ర్స్ కి అది సాధ్య‌ప‌డ‌ద‌ని తెలుస్తోంది.  RRR అనేది సాధారణ ఆంగ్ల సంక్షిప్త రూపంగా ఉండటంతో RRR నిర్మాత‌లు దానిపై ట్రేడ్ మార్క్ ను క్లెయిమ్ చేయలేరు. దానిని ఆ విధంగా ఉపయోగించినందుకు బ్రాండ్ లపై దావా వేయలేరు. అయితే RRR ఈ విధంగా అన్ని వర్గాల ద్వారా అద్భుతమైన ఉచిత ప్రచారాన్ని పొందుతోంది. దాంతో సంతృప్తి ప‌డాల్సిందే.  RRR చిత్రం 600కోట్ల క్ల‌బ్ లో చేరేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దని ఫిల్మీ ట్రేడ్ విశ్లేష‌ణ సాగుతోంది.
Tags:    

Similar News