టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న విడుదలవుతోంది. గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్ బుకింగ్ ద్వారా `ఆర్ ఆర్ ఆర్` 1 మిలియన్ పై చిలుకు వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో దర్శకు రాజమౌళి ఇద్దరు హీరోలతో కలిసి మూవీ ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు. దుబాయ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని ఈ నెల 18న పూర్తి చేసుకున్న చిత్ర బృందం చిక్ మంగుళూరులో మరో భారీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. దీనికి ఆ రాస్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తో పాటు తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా హాజరవుతారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూ సినిమాపై అసక్తిని పెంచేస్తున్నారు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే రేంజ్ లో వుంటుందని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని టీమ్ మెంబర్స్ బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆదివాసీలకు అండగా బ్రిటీష్ వారికి ఎదురుతిరిగే నాయకుడిగా ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో బ్రిటీష్ వారిని ఎన్టీఆర్ ఎదిరించే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ బ్రిటీష్ అధికారిగా కనిపించబోతున్నారు. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన నేరానికి ఎన్టీఆర్ ని అరెస్ట్ చేయడానికి రామ్ చరణ్ బ్రిటీష్ అధికారి డ్రెస్ లో వస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుందని, ఈ ఎపిసోడ్ లో చరణ్ పై ఎన్టీఆర్ దాడి చేసే ఘట్టాలు ఇంటర్వెల్ బ్యాంగ్ కి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
ఈ ఎంటైర్ ఎపిసోడ్ దాదాపు 15 నిమిషాల పాటు భీకరంగా సాగుతుందని, ఇది సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచి ప్రేక్షకులని రోమాంచితుల్ని చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఈ సీన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పై క్లోజ్ లు తీసుకున్నానని, ఒకరిని మించి ఒకరు ఈ సీన్ లో అదరగొట్టాకరని, థియేటర్లలో ఈ సీన్ ని చూసి ప్రేక్షకులు స్పెల్ బౌండ్ కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ రన్ టైమ్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ రన్ టైమ్ 3 గంటలు.