సమంత సూపర్‌ క్యూట్ కి మతి పోవాల్సిందే

Update: 2022-02-28 23:30 GMT
సమంత ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ అండ్‌ పెయిడ్‌ హీరోయిన్ లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకోవడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూనే ఉండటం వల్ల ఎప్పుడు కూడా ఈమె వార్తల్లోనే ఉంటూ వస్తుంది. తాజాగా మరోసారి సమంత తన అందమైన ఫోటో మరియు వీడియో తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటో మరియు వీడియోను షేర్‌ చేసిన సమంత తన అందంకు కారణం నీరజ కోన అంటూ ఇన్ స్టా లో మెన్షన్‌ చేసింది. తన వీడియో యొక్క పూర్తి క్రెడిట్‌ ను ఆమెకే ఇచ్చేసిన సమంత అందమైన ఫోటోలు మరియు వీడియోలను మరిన్ని షేర్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ట్రెండీ డ్రస్ లో ఈ అమ్మడి అందం మరింతగా పెరిగిందటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సమంత రోజులు గడుస్తున్నా కొద్ది అందంగా మారుతున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది సమంత మాత్రమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద ఎత్తున సమంత గురించి ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. తాజాగా సమంత సూపర్‌ క్యూట్ ఫోటో లు అభిమానులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మతి పోగొడుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. తాజాగా ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చింది. మరో వైపు తమిళంలో ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. యశోద అనే భారీ పాన్ ఇండియా సినిమా కూడా ఈమె చేస్తోంది.

తెలుగు మరియు తమిళ సినిమా లు మాత్రమే కాకుండా హిందీలో కూడా ఈమె సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉంది. తాప్సి నిర్మాణంలో ఈ అమ్మడు ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా విషయమై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఒక హాలీవుడ్‌ సినిమా ను కూడా ఈమె చేస్తోంది. మొత్తానికి సమంత బిజీ బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ గానే ఉంటుంది.
Tags:    

Similar News