ప్రపంచ వేదిక మీద.. అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్య వ్యాధిని వేళాకోళంగా మార్చేస్తే ఏ భర్తకు మాత్రం కోపం రాదూ? అందులోకి ఆ భర్త సూపర్ హీరో అయితే? ఆవేశం రాకుండా ఉంటుందా? అస్కార్ పురస్కారాల వేళ హాలీవుడ్ సూపర్ హీరో విల్ స్మిత్ కు అలాంటి అనుభవం ఎదురుకావటం.. అందుకు తగ్గట్లే అతడు స్పందించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తన భార్యను ఉద్దేశించి యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ ను.. వేదిక పైకి వెళ్లి మరీ లాగి పెట్టి కొట్టిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విల్ స్మిత్ చేసింది తప్పే కాదని పలువురు వ్యాఖ్యానిస్తుంటే.. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సింది.. క్రిస్ హాస్యానికి రియాక్షన్ అలా ఉండకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది.
ఇదే వేదిక మీద అస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న విల్ స్మిత్.. తన చేష్టపై బాధను వ్యక్తం చేస్తూ.. సారీ చెప్పారే కానీ.. తాను లాగి పెట్టి పీకిన క్రిస్ రాక్ కు మాత్రం సారీ చెప్పక పోవటం తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంపై అస్కార్ అకాడెమీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వ్యవహరించటంతో పాటు.. అనూహ్య పరిణామానికి కారణమైన విల్ స్మిత్ పై చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడెమీ సభ్యులకు తాజాగా ఒక లేఖను పంపటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. విల్ స్మిత్ తీరును తప్పు పట్టటంతో పాటు.. ఈ తరహా వైఖరితో తాము కలత చెందామని.. అతడి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘ఆయన హద్దు మీరారు. నిబంధనల్లో భాగంగా.. అకాడమీ గవర్నర్ల బోర్డు తగిన చర్య తీసుకోవాలి’ అంటూ రాసిన ఎఎంపీఎఎస్ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ లేఖ నేపథ్యంలో విల్ స్మిత్ పై చర్యలు తప్పవన్న మాట వినిపిస్తోంది. అయితే.. మనోభావాలు దెబ్బతినేలా.. మనసును గాయపరిచేలా వేదిక మీద ఉన్న వారు ఏమైనా మాట్లాడేయొచ్చా? అలాంటి వారేం చేసినా ఫర్లేదా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సిన అవసరం ఉంది.