చూస్తుంటే శ్రుతి హాసన్ ట్రాక్ లో పడినట్టుగానే కనిపిస్తోంది .. మునుపటి క్రేజ్ ను అందుకోవడానికి ఆమె చాలా గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. వరుస అవకాశాలు వచ్చి ఆమె ఒళ్లో వాలుతున్నాయి.
ఒకే సమయంలో బాలకృష్ణతో పాటు చిరంజీవి సినిమాను చేసే ఛాన్స్ రావడం చూస్తుంటే కాలం కలిసొచ్చినట్టే అనే విషయాన్ని ఖరారు చేసుకోవలసి వస్తోంది. నిజానికి తెలుగు .. తమిళ భాషల్లో శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ ఉండేది. పాలమీగడతో చేసినట్టుగా కనిపిస్తూ పడుచు ప్రేక్షకుల మనసులను పోలోమంటూ కొల్లగొట్టేసింది. అల్లరి వయసుల్లో అగ్గి రాజేసింది.
అలాంటి శ్రుతి హాసన్ బాలీవుడ్ సినిమాల పట్ల ఆశతో తెలుగు .. తమిళ సినిమాలను దూరం పెట్టింది. పోనీ బాలీవుడ్ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టిందా అంటే అదీ లేదు. లవ్ ట్రాక్ లో పడిపోయి బాలీవుడ్ అవకాశాల గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. తమ దగ్గరున్న డబ్బులు అయిపోయిన తరువాతనే నిజమైన ప్రేమ ఎలా ఉంటుందనేది చాలా మంది హీరోయిన్లకు అర్థమైంది. అదే బాటలో శ్రుతి కూడా కొంతవరకూ కళ్లు తెరుచుకుని మళ్లీ అవకాశాల వైపు అడుగులు వేసింది. ఆ సమయంలోనే తెలుగులో 'క్రాక్' హిట్ ఆమెకి ఉపశమనం ఇచ్చింది.
ఆ సినిమా తరువాతనే ఆమెకి 'సలార్' వంటి పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గోపీచంద్ మలినేని - బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 'సలార్' సామాన్యమైన సినిమా కాదనే విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే శ్రుతి మళ్లీ బిజీ కావడం ఖాయమే. ఇక ఇటు 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. అటు 'క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందువలన ఈ ఏడాది ఈ రెండు సినిమాలు ఆమె కెరియర్ కి బాగా కలిసొచ్చేవేనని చెప్పచ్చు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి - బాబీ సినిమాలోను శ్రుతి హాసన్ చేయనుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' .. 'వాల్తేర్ మొనగాడు' అనే పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రుతి హాసన్ చేయనుందనేది ప్రచారం మాత్రమే కావొచ్చని అనుకున్నారు. కానీ నిన్న 'మహిళా దినోత్సవం' సందర్భంగా తమ సినిమాలో ఆమె చేస్తుందనే విషయాన్ని ఈ సినిమా టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమా టీమ్ లోకి ఆమెకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది.
ఈ సందర్భంగా ఆమెకి బొకేలను అందజేస్తూ చిరంజీవి .. బాబీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతవరకూ పవన్ .. చరణ్ .. బన్నీలతో శ్రుతి హాసన్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఆమె మంచి డాన్సర్ కూడా కావడంతో, మెగాస్టార్ సరసన ఈ మెరుపుతీగ ఆటపాటలు బీభత్సంగా ఉంటాయని మురిసిపోతూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.