తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య మరియు అల్లుడు ధనుష్ లు విడిపోయేందుకు సిద్దం అయ్యారు. ఆ విషయాన్ని స్వయంగా వారే అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలపై తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఇద్దరు కూడా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ధనుష్ మరియు ఐశ్వర్య ల మద్య విడాకులకు కారణం ఏంటీ అనే విషయం పై క్లారిటీ లేదు. కాని తమిళ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రధానంగా ధనుష్ మరో అమ్మాయితో రిలేషన్ కారణంగానే ఐశ్వర్య ఆయన నుండి విడి పోవాలని భావించినట్లుగా కథనాలు వచ్చాయి. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సమయంలో అదే తమిళ మీడియాలో ధనుష్ మరియు ఐశ్వర్య లు తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అనే విషయం తెల్సిందే. ఆ ఇద్దరు పిల్లల కోసం ధనుష్ మరియు ఐశ్వర్య లు మరి కొంత కాలం కలిసి ఉండాలని భావిస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అది కాస్త మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతోంది. ఇద్దరు విడాకులకు అప్లై చేయడం జరిగింది.. అందుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో విడాకుల నిర్ణయంను వారు వెనక్కు తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని మరి కొందరు అంటున్నారు.
కేవలం పిల్లల కోసం వారు కొన్నాళ్ల పాటు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని.. పిల్లలు పెద్ద వారు అయ్యి ఉన్నత చదువులకు వెళ్లే వరకు కలిసి ఉండాలని భావిస్తున్నారట. రజినీకాంత్ వీరిద్దరిని కలిపి ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడని టాక్. అయినా కూడా కలిసి జీవితాన్ని సాగించేందుకు ఐశ్వర్య మరియు ధనుష్ ఇద్దరు కూడా ఒప్పుకోలేదు అనేది టాక్. కాని ఇప్పుడు పిల్లల కోసం ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయానికి రావడం అభినందనీయం.
విడాకులు తీసుకున్న దంపతులు పిల్లల కోసం కలిసి ఒకే ఇంట్లో జీవితం సాగించకున్నా అప్పుడప్పుడు కలవడం.. పిల్లలకు సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం మనం చూస్తూనే ఉన్నాం. హృతిక్ రోషన్ మొదలుకుని పలువురు బాలీవుడ్ స్టార్స్ మరియు టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది ఉన్నారు. కాని ధనుష్ మరియు ఐశ్వర్యలు మాత్రం ఒకే ఇంట్లో ఉంటారని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అనే విషయం తెలియాలంటే... వారి విడాకుల వ్యవహారం పై మరింత క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
వరుసగా తమిళం.. హిందీ.. ఇంగ్లీష్ సినిమాలను కూడా చేస్తున్న ధనుష్ ఇటీవలే తెలుగు సినిమాను కూడా మొదలు పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమాను ధనుష్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ధనుష్ కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో షూటింగ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ పునః ప్రారంభించి ఆ షెడ్యూల్ ను ముగించారు. సర్ సినిమా ను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.