పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోందంటే సౌత్ నుంచి నార్కత వరకు జరిగే సందడి వేరుగా వుంటోంది. 'బాహుబలి' తరువాత ప్రభాస్ రేంజ్ పెరగడం.. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువకావడమే కాకుండా ప్రభాస్ కు నార్త్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్నపడింది. అదే 'సాహో' విషయంలో రుజువైంది కూడా. 'సాహో' మూవీ దక్షిణాదిలో ఫరవాలేదనిపించినా ఉత్తరాదిలో మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్లని సాధించి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
దీంతో ప్రభాస్ సినిమా వస్తోందంటే దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ హంగామా మొదలవుతోంది. 'సాహో' తరువాత దాదాపు మూడేళ్ల విరామం తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ మూవీ మార్చి 11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. విధికి - ప్రేమకు మధ్య సాగే పోరాటం నేఫథ్యంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. యువీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార పర్వాన్ని హోరెత్తించడం మొదలుపెట్టారు. రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ తో ప్రచార పర్వాన్ని ప్రారంభించిన మేకర్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్ లతో మరింతగా ప్రచారాన్ని స్పీడప్ చేశారు.
ఇప్పటికే ఈ మూవీ వాయిస్ ఓవర్ కోసం జక్కన్న రాజమౌళిని రంగంలోకి దింపేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ప్రచారం కోసం కూడా రాజమౌళినే నమ్ముకోవడం ఆసక్తికరంగా మారింది.
'ఆర్ ఆర్ ఆర్' కోసం భారీ స్థాయిలో ప్రచార పర్వాన్ని ప్లాన్ చేసి విజయవంతంగా పూర్తి చేసిన రాజమౌళి రిలీజ్ వాయిదా పడి ఫైనల్ గా మార్చి 25న 'ఆర్ ఆర్ ఆర్' రీలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో మరో సారి ప్రమోషనల్ ప్లాన్స్ ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళిని 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ కోసం రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ప్రత్యేకంగా హీరో ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు.
ఈ స్పెషల్ ఇంటర్వ్యూని మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూ సినిమా ప్రచారాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. ఇండైరెక్ట్ గా ప్రభాస్ 'రాధేశ్యామ్' ప్రాజెక్ట్ లో భాగం అవున్న జక్కన్న ఈ ప్రాజెక్ట్ కి ఎంత వరకు ప్లస్ అవుతారో.. తన కారణంగా సినిమా ఏ లెవెల్ కి చేరుకుంటుందో తెలియాలంటే ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే.