చిన్న సినిమాగా తెరకెక్కి విడుదల సమయంలో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ ఇంకా ఎంతో మంది భారత రాజకీయ సినీ దిగ్గజాల మరియు సాదారణ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా చిన్న బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో కాశ్మీర్ లోని హిందూ పండిట్ల పై జరిగే అఘాయిత్యాలు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించే ప్రయత్నం చేశారు. అక్కడి హిందువులు మరియు స్థానికులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పాటు వారు భారత్ పాకిస్థాన్ల మధ్య ఎంతగా నలిగిపోతున్నారు అనే విషయాన్ని కూడా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు.
సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని మొదట సెన్సార్ బోర్డు ఈ సినిమా సెన్సార్ కి నో చెప్పింది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు రివ్యూ సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లగా అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏ మాత్రం బజ్ లేకుండా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా శనివారం నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ గా వసూళ్లను దక్కించుకుంటుంది.
ఈ సినిమా మొదటి రోజు తక్కువ స్క్రీన్స్.. తక్కువ థియేటర్లలో విడుదల అవడం వల్ల కేవలం నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే దక్కించుకుంది. కానీ శనివారం ఈ సినిమాకి అనూహ్యంగా రూ. 10 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు ఇంతటి భారీ వసూళ్లను సొంతం చేసుకోవడం అనేది రికార్డ్.
మొదటి రోజు వచ్చిన టాక్ మరియు రివ్యూ లతో రెండవ రోజు థియేటర్ల సంఖ్య దాదాపు రెట్టంపు సంఖ్య కి పెంచడం జరిగింది. దాంతో దేశ వ్యాప్తంగా సినిమా గురించి చర్చ జరగడం మొదలయ్యింది. శనివారం అనూహ్యంగా భారీ వసూళ్లు నమోదయ్యాయి.
ఆదివారం కూడా శనివారం వచ్చిన వసూళ్లకు మించిన వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా సినిమా ఎవరు ఊహించని విధంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంను విశ్లేషకులు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఒక్క ఇండియన్ చూసే విధంగా ఈ సినిమా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.