మూవీ ఆర్టిర్టసు అసోషియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఈమద్య కాలంలో హీరోగా వరుస పరాజయాలు మూట కట్టుకుంటున్నాడు. దాంతో కాస్త మెల్లగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఆలస్యం అయినా కూడా పర్వాలేదు. కాని మంచి సినిమాలతో రావాలనే ఉద్దేశ్యంతో మంచి విష్ణు టైమ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంచు విష్ణు ఒక సినిమాను చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
గ్యాంగ్ స్టర్ గంగరాజు దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు సినిమా పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది. కోన వెంకట్ ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆమద్య ఇన్ స్టా లో ఒక వీడియోను షేర్ చేసి సినిమా పై ఆసక్తి కలిగేలా చేసిన మంచు విష్ణు ఈ సారి మరో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్ ను రివీల్ చేయడం ద్వారా వార్తల్లో నిలవడమే కాకుండా సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేశాడు.
ఈషాన్ సూర్య దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా లో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు అని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఈ ఫోటోను షేర్ చేశాడు. గాలి నాగేశ్వరరావు చాలా విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు అంటూ ఆయన షేర్ చేసిన ఈ ఫోటో గురించి మీడియా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
హీరో పాత్ర పేరు చూస్తుంటే.. ఆ ఫోటో లో కార్టూన్ ను చూస్తుంటే చాలా మాస్ పాత్ర అనిపిస్తుంది. అంతటి మాస్ పాత్రకు మనోడు కరెక్టేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ పై నెగిటివిటీ చాలా ఉంది. కాస్త అటు ఇటు అయినా కూడా బొమ్మ కనపడటం ఖాయం అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు. కనుక మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమా మరియు లుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు.
ఇటీవల మంచు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియాకు ఎంతటి ఘోర పరాభవం ఎదురైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు సినిమా టాక్ కూడా రివీల్ కాకుండా సినిమా ను అట్లర్ ప్లాప్ చేశారు. సోషల్ మీడియాలో వారిపై అంతగా వ్యతిరేకత ఉంది కనుక ఈ సినిమా విషయంలో మంచు విష్ణు జాగ్రత్తలు పాటించాలని శ్రేయోభిలాషులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను మరియు ఇతర విషయాలను త్వరలో రివీల్ చేస్తామని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా ను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.