సినిమా ఇండస్ట్రీ లో ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఎంత ప్రముఖ వ్యక్తికి సన్నిహితులు అయినా కూడా టాలెంట్ తోనే సక్సెస్ లు వస్తాయి.. టాలెంట్ ఉంటేనే స్టార్ గా నిలదొక్కుకుంటారు. ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినంత మాత్రాన స్టార్లు అయిపోయినట్లు కాదు. సూపర్ స్టార్.. మెగా స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు కూడా సక్సెస్ లు లేకపోవడంతో స్టార్ గా నిలదొక్కుకోలేక పోయారు.
ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిన వారికి మాత్రమే స్టార్ డమ్ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ హీరోలు ఎక్కువ శాతం మంది కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగు అవుతున్నారు. కొందరు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ అందరికీ చాలా కొత్తగా.. విభిన్నంగా కనిపిస్తున్నాడు.
అతడి సినిమాల ఎంపిక తీరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి సినిమా ఎంపిక నుండి మొదలు పెట్టుకొని అతడి మూడో సినిమా వరకు కూడా వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ వచ్చాడు. ఏ హీరో చేయని సాహసం అతడు మొదటి సినిమాలోనే చేసేందుకు సిద్ధమయ్యాడు. తెలుగులో ఏ కమర్షియల్ హీరో కూడా అలాంటి పాత్రను.. క్లైమాక్స్ ను ఒప్పుకోడు. కానీ దర్శకుడు బుచ్చిబాబు పై నమ్మకంతో వైష్ణవి తేజ్ ఆ క్లైమాక్స్ కు ఒప్పుకోవడం నిజంగా ఆయన యొక్క నమ్మకం మరియు సినిమాపై ఇష్టం అనడంలో చెప్పడం ఎలాంటి సందేహం లేదు.
వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం కూడా విభిన్నమైన సినిమా. ఆ సినిమాను కూడా విభిన్నంగా ఆలోచించి చేశాడు. కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు కొండపొలం కచ్చితంగా నచ్చదు అని చాలా మందికి తెలుసు. వైష్ణవ్ తేజ్ కి కూడా ఆ విషయం తెలుసు.. కానీ నటుడిగా సక్సెస్ సాధించాలంటే అలాంటి సినిమాలు చేయాలని భావించాడు. అందుకే తక్కువ అనుభవంతోనే తోనే ఆ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఇక వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా రంగ రంగ వైభవంగా. ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ సినిమాని మొదట అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో లవ్ స్టొరీ తో పాటు పొలిటికల్ డ్రామా కూడా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశ్యంతో వైష్ణవ్ ఇలాంటి కథ ను ఓకే చేశాడు అంటూ ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కెరీర్ ఆరంభంలో వరుసగా కమర్షియల్ ఎలిమెంట్స్ కుప్పలు తెప్పలుగా ఉన్న సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. కానీ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మాత్రం ఆ దారిలో నడవకుండా తన దారి డిఫరెంట్ అని నిరూపించుకుంటూ వైవిధ్యభరిత కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి కథలను చేయడం ద్వారా అన్నను మించిన హీరోగా తమ్ముడు వైష్ణవ్ నిలుస్తాడని టాక్ వినిపిస్తుంది.