మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాజా మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన రవితజ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా.. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రాజా అభిమానుల్ని ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో సామ్ సీఎస్ సౌండ్ ట్రాక్ లు క్యూరియాసిటీని పెంచుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రవితేజ లుక్..రొటీన్ మాస్ కంటెంట్ కి డిఫరెంట్ గానే ఫోస్ అవుతుంది.
ఇక ట్రైలర్ లో మాస్ రాజా విశ్వరూంప రివీల్ అయ్యే చాన్స్ ఉంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో వీలైనంత రియాల్టీ చూపించే ప్రయత్నం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యూనిట్ టాకీ పార్టు పూర్తి చేసింది. దీంతో యూనిట్ పాటల చిత్రీకరణ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా విదేశీ అందాల నడుమ పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే యూనిట్ స్పెయిన్ చేరుకుంది. స్పెయిన్ అందాల నడుమ రెండు పాటలు చిత్రీకరించనున్నారు. సాంగ్ షూట్ సైతం మొదలైనట్లు తెలుస్తోంది.
ఇందులో రవితేజకి జోడీగా దివ్యషా కౌశిక్ -రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందాల బ్యూటీల నడుమ రాజా నారీ నారీ నడుమునారీ చందంగా రాజా సిగ్నేచర్ స్టెప్పులతో అలరించనున్నారు. స్పెయిన్ లో చిత్రీకరిస్తున్న రెండు పాటల్లో భామలిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. అనంతరం లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర ఆద్యంతం ఆకట్టుకోనుంది. మరోవైపు ఏక కాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.
చిత్రీకరణతో పాటే నిర్మాణానంతర పనులపైనా యూనిట్ దృష్టి నిలిపినట్లు తెలుస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రవితేజ నటించిన 'ఖిలాడి' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడం విఫలమైంది. దీంతో రామారావుతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సినిమాపై రాజా చాలా నమ్మకంగాను కనిపిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'రావణాసుర'..'ధమాకా'..'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాల్ని కూడా రవితేజ సెట్స్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
రామారావు లో నాజర్..సీనియర్ నరేష్.. పవిత్రా లోకేష్..జానీ విజయ్..చైతన్య కృష్ణ..తనికెళ్ల భరణి.. రాహుల్ రామకృష్ణ.. 'ఈరోజుల్లో' ఫేం శ్రీ.. మధుసూదన్ రావు..సురేఖ వాణి తదిరలు నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎస్ .ఎల్ .వి సినిమాస్ ఎల్ ఎల్ పీ- ఆర్ టీటీ టీమ్‌వర్క్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్. సి. ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ కె. ఎల్ ఎడిటింగ్ సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. స్టోరీ -స్కీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్ శరతమ్ మండవ.