యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి పేరు ని ఉపయోగించుకోకుండా హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఒక స్టార్ హీరో కూతురైన కూడా ఆమె మొదటి సినిమాలోనే బికినీ ధరించి ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. అయితే మొదటి సినిమా ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తి మరియు నమ్మకం ఇంకా నటన ప్రతిభతో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.
బాలీవుడ్ తో పాటు ఇతర వుడ్ ల్లో సినిమాలు అయితే చేస్తోంది కానీ ఆమెకు సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది. అప్పడే పవన్ కళ్యాణ్ కు జోడిగా గబ్బర్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత శృతి హాసన్ వెను దిరిగి చూసుకోలేదు. శృతిహాసన్ తనకు తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
సంగీత దర్శకురాలిగా.. డ్యాన్సర్ గా.. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇలా పలు రకాలుగా తనను తాను జనాల్లోకి తీసుకు వెళ్లాలి అనే ప్రయత్నాలు చేసింది. లండన్ వంటి ఎన్నో ప్రధాన నగరాలలో డాన్స్ షో లు.. స్టేజ్ షోలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ యాక్టింగ్ ద్వారానే ఈమెకు ఆర్థికంగా మరియు ఇతర విషయాల పరంగా మంచి జరిగింది. కనుక ప్రస్తుతానికి స్టేజ్ షోలు మరియు సంగీతాన్ని శృతి హాసన్ పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.
ఎందుకంటే గతంలో మాదిరిగా అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా అన్నట్లుగా కాకుండా రెగ్యులర్గా సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో పలు సినిమాలు చేయడంతో పాటు ప్రభాస్ కి జోడీగా సలార్ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా హీరోయిన్ గా నటించేందుకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
సినిమాల్లో ఇంత బిజీ అవ్వడం వల్ల శృతి హాసన్ మ్యూజిక్ కి కాస్త దూరంగా ఉంది అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆమె సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శృతిహాసన్ ప్రస్తుతానికి పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టినట్లుగా ఆ సినిమాల ఎంపికను బట్టి అర్థమవుతుంది.
శృతి హాసన్ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంది అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్గా కెరీర్ మంచి లెవెల్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు శృతిహాసన్ మ్యూజిక్ ను ఎంపిక చేసుకొని దానిపై విజయాలు సాధించేందుకు ప్రయత్నించాలి అంటూ విశ్లేషకులు సలహాలిస్తున్నారు.