అందాల ఆరబోతలో ఈ లోఫర్ బ్యూటీ క్రియేటివిటీ

Update: 2022-03-13 15:53 GMT
తెలుగు సినిమా లోఫర్ తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హాట్‌ బ్యూటీ దిశా పటానీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ లో దిశా పటాని హీరోయిన్ గా నటించడం తో మంచి ఏంట్రీ ఆమెకు దక్కినట్లయ్యింది. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించి మెప్పించడం తో ఆ తర్వాత నుండి మంచి అవకాశాలు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ నుండి దిశాకు వచ్చాయి.

తెలుగు లో చిన్న సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. చిన్న చితక సినిమాల్లో కాకుండా పెద్ద సినిమాల కోసం స్టార్స్‌ సినిమాల కోసం ఎదురు చూసింది. ఆ సమయంలోనే బాలీవుడ్ నుండి ఈ అమ్మడికి పిలుపు రావడం తో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ లను దక్కించుకుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన బాఘీ 2 ఇంకా కొన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో దిశా పటాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమా లతో ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఈమె షేర్‌ చేసే ఫోటోలకు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఒక్క ఫోటో షేర్ చేస్తే నిమిషాల్లో లక్షల లైక్స్ ఆమె సొంతమవుతాయి.

ఇప్పటివరకు ఎన్నో హాట్ ఫోటోలను.. విభిన్న తరహాలో ఫోజులు ఇస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. తాజాగా సముద్రం ఒడ్డున పడుకొని సేద తీరుతూ ఉన్నట్లుగా ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటో కి అనూహ్య మంచి స్పందన దక్కింది. అందాల ఆరబోతలో ఇలాంటి క్రియేటివిటీ ని వాడటం నీకు తప్ప మరెవరికి సాధ్యం కాదు అంటూ దిశా పటాని పై ఆమె ఫాలోవర్స్ మరియు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ అందాలను కనిపించి కనిపించకుండా తన అందంతో యువతను మత్తెక్కిస్తున్న ఈ అమ్మడి ఫోటో షూట్‌ ను ప్రేక్షకులు మరియు అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News