మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈ సినిమా కథ ఒరిజినల్ స్టోరీనే కాని ఆ తర్వాత చిరంజీవి చేయబోతున్న రెండు సినిమాలు కూడా రీమేక్ లు అనే విషయం చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. లూసీఫర్ మరియు వేదాళం సినిమాలను చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. లూసీఫర్ కు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
ఇదే నెలలోనే లూసీఫర్ రీమేక్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం ను మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అతి త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్వకత్వంలో కూడా ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నారు.
చిరంజీవి ఈ మూడు సినిమాలను గత ఏడాదిలోనే కన్ఫర్మ్ చేశారు. ఆచార్య తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు చేయాలని చిరంజీవి భావించారు. కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతున్నాయి. కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ సమయంలో లూసీఫర్ ను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఒరిజినల్ కథతో అనే అంతా అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా బాబీ ఒక కథను తయారు చేశాడు.. ఆ కథ చిరంజీవికి బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. కాని తాజాగా సోషల్ మీడియాలో ఒక వర్గం వారు మాత్రం బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా కూడా ఓ సినిమాకు రీమేక్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
బాబీ ఓ క్లాసిక్ మూవీకి అనఫిషియల్ గా రీమేక్ ను రెడీ చేస్తున్నాడు అంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి. బాబీ ఒక సినిమా నుండి ఇన్ఫిఫైర్ అయ్యి చిరంజీవి కోసం కథ రాసుకున్నాడని.. అందుకే అది కూడా ఒక రీమేక్ గానే పరిగణించాలంటూ కామెంట్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి లూసీఫర్ మరియు వేదాళం రీమేక్ లు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా రీమేక్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానుల్లో ఈ విషయమై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి అప్డేట్ లేదు. కనుక మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అయ్యి ఉంటాయి. చిత్ర యూనిట్ సభ్యుల నుండి స్పష్టత వచ్చే వరకు అభిమానులు పుకార్లను నమ్మవద్దంటూ మెగా కాంపౌండ్ వారు అంటున్నారు.
లూసీఫర్ రీమేక్ కు సంబంధించిన సన్నాహాలు పూర్తి అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది. మోహన్ రాజా ఈ సినిమా కోసం హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక వేదాళం రీమేక్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు గాను బాలీవుడ్ హాట్ బ్యూటీని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి కాజల్ తో రొమాన్స్ చేయగా.. సినిమాలో కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాడు. కనుక సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.