అక్కడ హీరోయిన్స్ బాగా ముదిరి పోయారు బాసూ!

Update: 2021-09-10 23:30 GMT
ఒకప్పుడు కేవలం హీరోల కోసం సినిమాను చూసేందుకు వచ్చేవారు. కొందరు హీరోయిన్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలిగారు. కాని ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్‌ స్టార్స్ గా.. సూపర్ స్టార్స్ గా పేరు దక్కించుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్స్ స్టార్‌ హీరోల రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఆ స్థాయిలో గుర్తింపు వస్తుంది కనుక తమకు హీరోల స్థాయిలో పారితోషికాలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హీరోలు కొందరు 50 నుండి 100 కోట్ల రూపాయల పారితోషికాలను తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్ ఆ రేంజ్ లో కాకున్నా పాతిక కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నారు అనేది బాలీవుడ్‌ లో వినిపిస్తున్న టాక్‌. సౌత్‌ లో రెండు కోట్ల పారితోషికం హీరోయిన్ కు ఇస్తున్నారు అంటేనే చాలా పెద్ద విషయం. కాని బాలీవుడ్‌ లో మాత్రం హీరోయిన్స్‌ బాగా ముదిరి పోయి సినిమా బడ్జెట్‌ మరియు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పదుల కోట్లలో పారితోషికం ను డిమాండ్‌ చేస్తున్నారు.

హీరోలు వందల కోట్ల సినిమాలు చేస్తున్నారు. వారి సినిమాలకు వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో పారితోషికాలు అదే రేంజ్ లో ఉంటాయి. ఇక హీరోయిన్స్ నటించిన కొన్ని సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి. కనుక సినిమాలకు పారితోషికాలు వారు అదే రేంజ్ లో తీసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్స్ గా కొనసాగుతున్న ముగ్గురు నలుగు హీరోయిన్స్ పది కోట్లకు తగ్గితే కనీసం నిర్మాత కు మొహం చూడా చూపించేందుకు ఇష్టపడటం లేదట. పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో తాజా సంఘటన సాక్షం అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ లో సీత అనే సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్‌ రచనతో సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సమయంలో సినిమా లో నటించేందుకు కరీనా కపూర్ ఖాన్‌ ఏకంగా 12 కోట్ల పారితోషికంను అడిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవి పుకార్లే అని కొందరు అనుకున్నారు. కాని స్వయంగా ఆమెనే నిజం అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది.

లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు ఆ మాత్రం పారితోషికం ఇవ్వకుంటే ఎలా అన్నట్లుగా ఆమె ప్రశ్నిస్తున్నారట. స్త్రీ పురుషులకు సమాన వేతనం గురించి ఈమద్య కాలంలో చాలా చోట్ల వింటున్నాం. మరి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో అలా జరగడం లేదు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. పారితోషికం తక్కువ అయితే సినిమా నుండి తప్పుకోవడానికి కూడా ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ సిద్దం అవుతున్నారు. ఎంత పెద్ద దర్శకుడు అయినా.. ఎంత ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా.. కథ ఎంత బాగున్నా కూడా పారితోషికం విషయంలో మాత్రం బాలీవుడ్ ముద్దుగుమ్మలు తగ్గేదే లేద అంటున్నారు. వీరు బాగా ముదిరి పోయారు అంటూ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అయినా కూడా వారి డిమాండ్ తగ్గడం లేదు. సీత సినిమాలో కరీనా కపూర్ కావాలంటే మాత్రం 12 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇవ్వక తప్పేలా లేదు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News