మహేష్‌ ను జక్కన్న అంత ఇబ్బంది పెట్టడట!

Update: 2022-03-30 23:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మగధీర మొదలుకుని తన ప్రతి సినిమాను కూడా ఏళ్లకు ఏళ్లు చేస్తూనే ఉన్నాడు. అంతకు ముందు సినిమాలు కూడా స్పీడ్ గా అయిన దాఖలాలు కూడా ఏమీ లేవు. సింహాద్రి మరియు చత్రపతి సినిమాలను కూడా అప్పట్లో లెక్కకు మించి రోజుల షూటింగ్‌ చేసి ఆ హీరోల యొక్క సహనానికి పరీక్ష పెట్టాడు. ముఖ్యంగా బాహుబలి సినిమా ను దాదాపుగా అయిదు సంవత్సరాలు చేయడంతో ప్రభాస్ ఎలా భరించాడో అంటూ ప్రతి ఒక్కరు గుసగులాడుకున్నారు.

బాహుబలి రేంజ్ లో కాకుండా ఈ సినిమాను ఖచ్చితంగా 2020 లో విడుదల చేస్తానంటూ ఆర్ ఆర్‌ ఆర్‌ మీడియా సమావేశంలో ప్రకటించాడు. కాని కరోనా వల్ల రాజమౌళి ప్రమేయం లేకుండా రెండేళ్ల పాటు ఆలస్యం అయ్యింది. అంటే ఈ ఆర్ ఆర్‌ ఆర్‌ కి కూడా నాలుగు ఏళ్ల సమయం పట్టింది. ఒక సినిమాను ఇంత గొప్పగా తీయడం గొప్ప విషయమే.. కాని దానికి అన్ని సంవత్సరాల టైమ్‌ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది కొందరి అభిప్రాయం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తన తదుపరి సినిమా విషయమై  మాట్లాడాడు. మహేష్ బాబు తో జక్కన్న సినిమా ఉండబోతుంది. షూటింగ్‌ ను ఎప్పుడు మొదలు పెట్టినా కూడా ఏడాది లోపే పూర్తి చేస్తామంటూ ప్రకటించాడు. ఇంతకు ముందు సినిమాల తరహాలో కాకుండా ఖచ్చితంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాను అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా చెప్పుకొచ్చాడు.

ఆర్ ఆర్‌ ఆర్‌ ను కూడా ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని భావించినా కరోనా వల్ల సమయం ఎక్కువ తీసుకుంది. కనుక కరోనా పరిస్థితులు కాని ఇతర పరిస్థితులు కాని ఇబ్బంది పెట్టకుంటే మహేష్ బాబు తో సినిమాను రాజమౌళి కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్ ఆర్‌ ఆర్‌ నుండి బయటకు వచ్చేందుకు రాజమౌళికి కనీసం నాలుగు అయిదు నెలల సమయం పడుతుంది.

ఆ సినిమా హ్యాంగోవర్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో మహేష్ బాబు యొక్క సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. అంటే 2023 సంవత్సరంలో సినిమాను పట్టాలెక్కించి.. 2024 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అనేది రాజమౌళి మాటల ఉద్దేశ్యం. అభిమానులు మాత్రం 2025 వరకు మహేష్‌ బాబు జక్కన్న సినిమా వచ్చినా సంతోషమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి వంటి దర్శకులు నాలుగు అయిదు సంవత్సరాలకు ఒక్క సినిమా తీయడం అనేది మంచిది కాదని.. ఇండస్ట్రీ యొక్క బాగు కోరుకునే వారు అయితే రాజమౌళి ఏడాదికి లేదా ఏడాదిన్నరకు ఒక సినిమా చొప్పున విడుదల చేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే జక్కన్న తన తదుపరి సినిమా విషయంలో ఎక్కువ సమయం తీసుకుని మహేష్ ను ఇబ్బంది పెట్టను అంటూ తేల్చి పారేశాడు. జక్కన్న ఎంత వరకు మాట మీద ఉంటాడు అనేది కూడా చూడాలి.
Tags:    

Similar News